ముంబై డీలర్ ఆఫర్: రూ.47,912 లకే వెస్పా ఎల్ఎక్స్ 125

By Ravi

పియాజ్జియో వెహికల్స్ దేశీయ విపణిలో అందిస్తున్న తమ ప్రీమియం లైఫ్ స్టయిల్ స్కూటర్ "వెస్పా ఎల్ఎక్స్ 125" ధరలో ఇటీవలే రెండుసార్లు కోతను విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మార్కెట్లో ఈ స్కూటర్ ధర రూ.59,990 (ఎక్స్-షోరూమ్, పూనే)గా ఉంది. ముంబైలోని ఓ వెస్పా డీలర్, వెస్పా ఎల్ఎక్స్ 125 స్కూటర్‌పై కంపెనీ ఆఫర్ చేస్తున్న డిస్కౌంట్ కాకుండా, తాను ప్రత్యేకంగా రూ.10,000 లకు పైగా డిస్కౌంట్‌ను ఆఫర్ చేసి, కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాడు.

ముంబైలోని అసెట్ వెస్పా డీలర్ వెస్పా ఎల్ఎక్స్ 125 స్కూటర్‌పై ఓ లిమిటెడ్ ఆఫర్‌ను అందిస్తున్నాడు. ఇందులో భాగంగా, వెస్పా ఈ స్కూటర్‌ను కేవలం రూ.47,912 లకే విక్రయిస్తున్నాడు. ఈ ఆఫర్ కేవలం నాలుగు రోజుల పాటు మాత్రమే అమల్లో ఉంటుంది.
అయితే, ఈ ఆఫర్‌కు షరతులు వర్తిస్తాయని సదరు డీలర్ తన ప్రకటనలో పేర్కొన్నాడు. కానీ ఆ షరతులు ఏంటో మాత్రం స్పష్టం చేయలేదు. మరిన్ని వివరాలను తమ డీలర్‌షిప్‌లో తెలియజేస్తామని అసెట్ వెస్పా పేర్కొంది.

Vespa LX125 For INR 47912

వెస్పా ఎల్ఎక్స్ 125 స్కూటర్‌ విషయానికి వస్తే, ఇందులో ఉపయోగించిన 124సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 10.26 బిహెచ్‌పిల శక్తిని, 6000 ఆర్‌పిఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇందులో సివిటి (కంటిన్యూస్లీ వేరియబిల్ ట్రాన్సిమిషన్) గేర్‌బాక్స్‌ను ఉపయోగించారు. ఇది ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 8 లీటర్లు. ఇది ఎలక్ట్రిక్ స్టార్ట్ లేదా కిక్ స్టార్ ఆప్షన్లతో లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, March 20, 2013, 11:29 [IST]
English summary
Asset Vespa - a Mumbai based Piaggio India dealer is selling the Vespa LX125 scooter at an attractive price of 47,912 rupees. Check this advertisement. Recently Piaggio has slashed the prices for its premium lifestyle scooter.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+