షెవర్లే యజమానుల కోసం 'మైషెవర్లే' స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్
జనరల్ మోటార్స్ ఇండియా తమ షెవర్లే వాహన యజమానుల ఉపయోగార్థం 'మైషెవర్లే ఇండియా' ఓ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ను విడుదల చేసింది. ఈ అప్లికేషన్ ద్వారా షెవర్లే వినియోగదారులు అనేక రకాల ప్రయోజనాలను కేవలం తమ స్మార్ట్‌ఫోన్ సాయంతోనే చేసుకును వెసులుబాటు ఉంటుంది. షెవర్లే ఈ తరహా అప్లికేషన్లను గ్లోబల్ మార్కెట్లో ఇప్పటికే అందిస్తోంది. కాగా.. ఇండియాలో ఇదే ప్రప్రథమం.
మైషెవర్లే ఇండియా స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ సాయంతో, షెవర్లే కస్టమర్లు తమ కారు సర్వీస్ డేట్‌ను షెడ్యూల్ చేసుకోవచ్చు, ఇలా షెడ్యుల్ చేసుకున్న రోజున స్మార్ట్ ఈ విషయాన్ని యజమానికి రిమైండ్ చేస్తుంది. అలాగే, ఈ అప్లికేషన్ సాయంతో మీకు సమీపంలో ఉన్న డీలర్‍షిప్ కేంద్రం వద్ద సర్వీస్ అపాయింట్‌మెంట్‌ను కూడా బుక్ చేసుకోవచ్చు.

ఒకవేళ మీరు ప్రయాణంలో ఉండి, మార్గమధ్యంలో ఏదైనా సర్వీస్ ఏర్పడితే, ఈ అప్లికేషన్ సాయంతో మీకు సమీపంలో ఉండే షెవర్లే డీలరు/సర్వీస్ సెంటర్‌ను వెతికి, టచ్-టు-కాల్ ఫీచర్ సాయంతో ఒక్క బటన్‌తో సదరు డీలరు/సర్వీస్ పాయింట్‌ను సంప్రదించవచ్చు. ఇందులో మరో ఆసక్తికరమైన ఫీచర్ ఏంటంటే, ఇందులో పార్కింగ్ రిమైండర్లను సెట్ చేసుకోవచ్చు. యూజర్ తన కారును ఎక్కడ పార్క్ చేశాడో అనే వివరాలను కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు.
మీ కారును ఎక్కడ పార్క్ చేశారో గుర్తు లేనప్పుడు ఈ అప్లికేషన్ సాయంతో, స్టోర్ చేసుకున్న డేటా ఆధారంగా సులువుగా కారును గుంపులో ఉన్న కూడా గుర్తించే అవకాశం ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ సాయంతో, ఇది మీకు మార్గం చూపిస్తుంది. అంతేకాదు, ఇది మీ కారుకు సంబంధించిన ఓనర్స్ మ్యాన్యువల్‌ను కూడా చూపిస్తుంది. ఇది ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లను సూట్ అవుతుంది. ఈ అప్లికేషన్‌ను ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు, గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఫోన్ యూజర్లు ఐట్యూన్స్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








