కొత్త నానో సెలబ్రేట్ ఆసమ్‌నెస్ ప్రకటనకు 50 లక్షల హిట్స్!
భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న కొత్త నానో కోసం రూపొందించిన ప్రకటనకు సంబంధించి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఈనెల ఆరంభంలో ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. 'సెలబ్రేట్ ఆసమ్‌నెస్' అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ ప్రకటన ఇప్పటి అన్ని టెలివిజన్లలో ప్రసారం అవుతోంది. కాగా.. ఒక్క ఇంటర్నెట్లోనే (య్యూట్యూబ్)లో ఈ ప్రకటనను 50 లక్షల మందికి పైగా వీక్షించారు.
ఈ ప్రకటన యూట్యూబ్‌లో విడుదలై సరిగ్గా నెల రోజులు కూడా పూర్తికాక ముందే 5 మిలియన్లకు పైగా హిట్‌లను దక్కించుకోవటం విశేషం. ప్రధానంగా నేటి ఆధునిక యువతను లక్ష్యంగా చేసుకొని టాటా ఈ కొత్త నానో ప్రకటనను కంపెనీ రూపొందించింది. 'సెలబ్రేట్ ఆసమ్‌నెస్ విత్ టాటా నానో' అనే థీమ్‌తో ఈ టెలివిజన్ కమర్షియల్‌లో ప్రధానంగా యువతే కనిపిస్తుంది. మీరు కూడా ఈ ప్రకటనను క్రింది వీడియోలో చూడొచ్చు.
<center><iframe width="600" height="450" src="//www.youtube.com/embed/Fj7kFvk-T7g?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>
2013 టాటా నానో గురించి క్లుప్తంగా..:
కస్టమర్ల ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకొని కొత్త నానో కారును అప్‌గ్రేడ్ చేశారు. ఇందులో రిమోట్ కీలెస్ ఎంట్రీ, డ్యాష్‌బోర్డుపై ఏర్పాటు చేసిన రెండు గ్లౌ బాక్సులు, 12 వోల్ట్ పవర్ సాకెట్‌తో కూడిన రీస్టయిల్డ్ సెంటర్ కన్సోల్, రియర్ పార్సిల్ షెల్ఫ్, నాలుగు స్పీకర్లు, బ్లూటూత్, ఆక్స్-ఇన్ మరియు యూఎస్‌బి సపోర్టుతో కూడిన ఆంఫీస్ట్రీమ్ మ్యూజిక్ సిస్టమ్ వంటి ఇంటీరియర్ ఫీచర్లను జోడించారు.
అలాగే, కొత్త ఎక్స్టీరియర్ కలర్స్, ఫ్రంట్ అండ్ రియర్ క్రోమ్ స్ట్రిప్స్‌తో మరింత ప్రీమియం లుక్‌నిచ్చేలా డిజైన్ చేశారు. వెనుక వైపు ఇంజన్‌ను కూల్‌గా ఉంచేందుకు గాను బంపర్‌కు పెద్ద ఎయిర్ వెంట్స్‌ను జోడించారు. సులువుగా స్టీరింగ్‌ను ఆపరేట్ చేసేలా స్టీరింగ్‌ను, సస్పెన్షన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు. ఇందులో మూడు కొత్త ఎక్స్టీరియర్ కలర్స్ (డాజల్ బ్లూ, రాయల్ గోల్డ్, కార్న్‌ఫ్లవర్ బ్లూ)ను జోడించారు.

రాష్ట్ర మార్కెట్లో కొత్త 2013 టాటా నానో వేరియంట్లు, ధరలు అలా ఉన్నాయి:
- నానో స్టాండర్డ్ - రూ.1,63,000
- నానో సిఎక్స్ - రూ.2,01,000
- నానో ఎల్ఎక్స్ - రూ.2,28,000
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)


Click it and Unblock the Notifications








