యాక్సిడెంట్ చేసి బాలిక ప్రాణాలు తీసిన ఎన్‌సిపి నేత కుమారుడు

ఈ ప్రమాదంలో 2 ఏళ్ల బాలిక మృతి చెందగా, మరో ఐదేళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. ఈ పిల్లలను తీసుకువెళ్తున్న వారి మామకు కూడా గాయాలయ్యాయి. ఔరంగాబాద్‌లోని సీనియర్ ఎన్‌సిపి నేత ఖదీర్ మౌలానా యొక్క 17 ఏళ్ల కుమారుడు నిబంధనలకు విరుద్ధంగా ఓ ఎస్‌యూవీని నడిపి రోడ్డుపై వెళ్తున్న బాలికలను ఢీకొట్టాడు. ఇదంతా ట్రాఫిక్ సిసిటివి కెమరాల్లో రికార్డయ్యింది. దీంతో సదరు బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ఆ కారుకు డ్రైవర్ ఉన్నప్పటికీ, తాను వెనుక సీట్లో కూర్చుని బాలుడి చేత డ్రైవ్ చేయించడం వలన ఈ ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో, బాలుడిని డ్రైవింగ్‌కు ప్రేరేపించిన డ్రైవర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరణించిన రెండేళ్ల బాలిక, ఆమె 5 ఏళ్ల అక్క మరియు వారి మామ సిరీష్ ముగ్గురు కలిసి గుడికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదం అనంతరం కారులోని వారు శిక్ష నుంచి తప్పించుకునేందుకు తమ కారుకు నిప్పంటించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే, పోలీసుల జోక్యంతో ఈ ప్రయత్నం విఫలమైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి లైసెన్స్ లేకుండా వాహనం నడపటం చట్టరీత్యా నేరం. తగిన వయో పరిమితిని మరియు చెల్లుబాటైన డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉంటే మాత్రమే వాహనాలను డ్రైవ్ చేయవచ్చు. ఆ బాలుడు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ఓ బాలిక ప్రాణాలను తీయటమే కాకుండా తన కెరీర్‌ను చిక్కుల్లో పడేసుకున్నాడు.


Click it and Unblock the Notifications








