ఇండియన్ గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ రేస్‌కు తగ్గుతున్న ఆదరణ
ఒకప్పుడు విదేశాలకు మాత్రమే పరిమితమైన ఫార్ములా వన్ (ఎఫ్1) రేస్ 2011లో భారతదేశానికి కూడా వచ్చి, మన దేశంలో రేస్ ప్రియులను అలరించింది. ఇండియన్ గ్రాండ్ ప్రి పేరుతో మన దేశంలో ఏటా జరుగుతున్న ఈ ఫార్ములా వన్ రేస్‌కు ఆదరణ క్రమంగా తగ్గిపోతుంది.
తొలిసారిగా ఫార్ములా వన్ రేస్ 2011లో భారత్‌లోని గ్రేటర్ నోయిడాలో అధునాతంగా ఏర్పాటు చేసిన బుద్ధ్ ఇంటర్నేషల్ సర్క్యూట్‌లో ప్రారంభమైనప్పుడు 97,000 టికెట్లు అమ్ముడుపోయాయి. 2012 గ్రాండ్ ప్రి సమయానికి ఈ సంఖ్య 67,000 లకు పడిపోయింది. కాగా.. ఇప్పుడు 2013 గ్రాండ్ ప్రికి కేవలం 40,000 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి.

మరో వైపు నిర్వహణ పెరగటం, భారీ మొత్తంలో పన్నులు చెల్లించాల్సి రావటంతో ఫార్ములా వన్ నిర్వాహకులకు ఇండియన్ గ్రాండ్ ఆర్థికంగా గిట్టుబాటు కావటం లేదు. అంతేకాకుండా, 4 మిలియన్ డాలర్ల వినోద పన్ను మినహాయింపును ఉపసంహరించడం, రేసుతో సంబంధం ఉన్న ఇతర ఖర్చుల పట్ల ఎఫ్1 అధినేత, బృందాలు అసంతృప్తిగా ఉన్నాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో, వచ్చే ఏడాది చివర్లో నిర్వహించాల్సిన 2014 ఇండియన్ గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ రేస్‌ను రద్దు చేశారు. అయితే, 2015లో ఇది తిరిగి భారత్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మొత్తమ్మీద చూసుకుంటే భారతదేశంలో ఫార్ములా వన్ రేస్‌కు ఆదరణ తగ్గుతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. 2013 ఇండియన్ గ్రాండ్ ప్రిలో నేడు ప్రాక్టీస్ సెషన్, రేపు క్వాలిఫైయింగ్ సెషన్ జరుగుతాయి. ఆదివారం నాడు ఫైనల్ రేస్ జరుగుతుంది.



Click it and Unblock the Notifications








