నేటి వీడియో: కొత్త 2014 మినీ కూపర్ టీజర్

By Ravi

బిఎమ్‌డబ్ల్యూకి చెందిన ప్రీమియం స్మాల్ కార్ బ్రాండ్ మినీ ఈనెల 18న ఓ అప్‍‌గ్రేడెడ్ కారును విడుదల చేయనుంది. మినీ అందిస్తున్న కూపర్‌లో ఓ ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్‌ను కంపెనీ ప్రవేశపెట్టనుది. ఒరిజినల్‌గా మినీ కారును డిజైన్ చేసిన సర్ అలెక్స్ ఇస్సిగోనిస్ 107వ జన్మదినాన్ని పురస్కరించుకొని, ఆక్స్‌ఫర్డ్ ప్లాంటులో నవంబర్ 18న ఈ కొత్త 2014 మినీ కూపర్‌ను ఆవిష్కరించనున్నారు.

కొత్త మినీ కూపర్ 3-సిలిండర్ అలాగే 4-సిలిండర్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఎంట్రీ లెవల్ వేరియంట్లో 1.5 లీటర్ 3-సిలిండర్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ 136 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 220 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పవర్‌ఫుల్ వెర్షన్ మినీ కూపర్‌లో శక్తివంతమైన 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 192 బిహెచ్‌పిల శక్తిని, 280 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇక డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఒక్క ఆప్షన్‌ను మాత్రమే అందుబాటులో ఉంచారు. ఇందులో 1.5 లీటర్, 3-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 116 బిహెచ్‌పిల శక్తిని, 270 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త మినీ కారులో సరికొత్త సేఫ్టీ ఫీచర్లను ఉపయోగించారు. మినీ తమ 2014 కూపర్ కారుకు సంబంధించి ఓ టీజర్ వీడియోను విడుదల చేసింది. ఒరిజినల్ కారును నవంబర్ 18, 2013న విడుదల చేయనున్నారు. ఈలోపుగా మనం కూడా టీజర్ వీడియోని వీక్షిద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/3IC6jtnUVgY?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Friday, November 15, 2013, 17:43 [IST]
English summary
The 2014 Mini Cooper will be unveiled on 18th November and the unveiling will take place at the Oxford plant, and the date also marks the 107th birthday of Sir Alex Issigonis, the original Mini’s designer. Take a look at 2014 Mini Cooper teaser video.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+