కొత్త కారు కొనేందుకు ఇదే సరైన సమయం..!

By Ravi

కొత్త కారు కొనడానికి ఇదే సరైన సమయం. ఈ ఒక్క నెల ఆగి వచ్చే సంవత్సరంలో కారు కొందామనుకుంటే, మీరు ప్రస్తుత ధర కన్నా అధిక ధరను చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే, కార్ల తయారీ కంపెనీలన్నీ కొత్త సంవత్సరంలో కార్ల ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. మరో నెల రోజుల వ్యవధిలో 2013 సంవత్సరం ముగియనుండటంతో తయారీదారులు తమ ప్రస్తుత సంవత్సర స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు కార్లపై భారీ డిస్కౌంట్లను, వివిధ ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తున్నాయి.

సాధారణంగా కస్టమర్లు ఈ సమయంలో కారును కొనుగోలు చేస్తే, కారు ఒక సంవత్సరం పాత మోడల్ అయిపోతుందని కొత్త సంవత్సరంలో కొనుగోలు చేసేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇది కొంతమేరకు నిజమే అయినప్పటికీ, కొత్త సంవత్సరం ఆరంభంలో అంటే జనవరి, ఫిబ్రవరి మధ్య కాలంలో కారును కొనుగోలు చేసినప్పటికీ, మీకు దాదాపు మునుపటి సంవత్సరంలో తయారైన కారునే విక్రయిస్తారు. కేవలం మీ కారు రిజిస్ట్రేషన్ తేది మాత్రమే కొత్త సంవత్సరంలో ఉంటుంది, తయారీ తేది గడచిన సంవత్సరానిదే ఉంటుంది.

Car Price Hike

ఇదిలా ఉంటే, మరోవైపు కార్ల తయారీదారులు ప్రతిఏటా కొత్త సంవత్సరంలో ధరలను పెంచేస్తుంటారు. ఇదే కోవలో 2014లో కూడా కొన్ని రకాల కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచేందుకు సిద్దంగా ఉన్నాయి. ఇప్పటికే జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా వచ్చే ఏడాది ఆరంభం నుంచి తమ కార్ల ధరలను 7 శాతం నుంచి 10 శాతం మేర పెంచనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. తాజాగా.. మరో జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా కూడా జనవరి 1, 2014 నుంచి కార్ల ధరలను పెంచనున్నట్లు పేర్కొంది.

వచ్చే ఏడాది ఆరంభం నుంచి తమ కార్ల ధరలను మోడల్‌ను బట్టి 3 శాతం నుంచి 5 శాతం మేర పెంచనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఆడి, బిఎమ్‌డబ్ల్యూ కంపెనీల బాటలోనే మరికొన్ని కార్ల తయారీ కంపెనీలు కూడా కొత్త సంవత్సరంలో తమ కార్లను భారీగా పెంచేసే ఆస్కారం ఉంది. కాబట్టి, సరసమైన ధరకే కొత్త కారును చేయాలనుకునే వారికి ఇదే అనువైన సమయం. ఈ సమయంలో కస్టమర్లు కార్లపై బేరమాడటానికి అవకాశం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీ స్వంత కారు కలను నిజం చేసుకోండి..!

More from DriveSpark

Article Published On: Thursday, November 28, 2013, 14:13 [IST]
English summary
This is right time to buy a new car as the car prices may go up in New Year 2014. German carmakers Audi and BMW has already announced an increase in price across its model range available in India, effective January 1, 2014.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+