జులై 15న మార్కెట్లోకి రానున్న నిస్సాన్ 'డాట్సన్'

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నిస్సాన్ తమ పురాతన డాట్సన్ బ్రాండ్‌ను ప్రపంచానికి పరియచం చేసేందుకు (డాట్సన్ బ్రాండ్ గ్లోబల్ ప్రీమియర్) భారతదేశాన్ని వేదికగా ఎంచుకుంది. ఈ డాట్సన్ బ్రాండ్ గ్లోబల్ ప్రీమియర్ సందర్భంగా నిస్సాన్ ఈ బ్రాండ్ క్రింద ఓ 5-డోర్ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును కూడా ఆవిష్కరించనుంది. ఈ చిన్న కారు సంబంధించిన బ్లూప్రింట్ స్కెచ్ ఒకటి ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తుంది.
భారత చిన్న కార్ సెగ్మెంట్లో ధరల యుద్ధానికి తెరలేపుతూ ఈ డాట్సన్ కారును రూ.4 లక్షల దిగువన నిస్సాన్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జులై 15న న్యూఢిల్లీలోని కింగ్‌డమ్ ఆఫ్ డ్రీమ్స్ వద్ద నిర్వహించనున్న డాట్సన్ గ్లోబల్ ప్రీమియర్‌లో ఈ చిన్న కారును అధికారికంగా ఆవిష్కరించనున్నారు. డాట్సన్ బ్రాండ్ క్రింద తయారైన ఉత్పత్తులను చిన్నకార్లకు డిమాండ్ ఎక్కువగా ఉండే ఇండియా, రష్యా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా మార్కెట్లలో నిస్సాన్ ప్రవేశపెట్టనుంది. డాట్సన్ స్మాల్ కారుకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








