చిన్న కారును అభివృద్ధి చేస్తున్న నిస్సాన్, హిందూజా

By Ravi

Datsun
ప్రస్తుతం భారత మార్కెట్లో చిన్న కార్లకు డిమాండ్ భారీగా ఉంటోంది. దీంతో దేశీయ కంపెనీలే కాకుండా అంతర్జాతీయ కంపెనీలు కూడా భారత మార్కెట్లో చిన్న కార్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే, నిస్సాన్ తమ పురాతన బ్రాండ్ 'డాట్సన్'ను తిరిగి మార్కెట్లోకి తీసువచ్చింది. తాజాగా, మనదేశానికి చెందిన హిందూజా గ్రూప్ కూడా ఇప్పుడు చిన్న కారు అభివృద్ధిపై దృష్టి సారించింది.

వాహనాల తయారీ విషయంలో హిందూజా గ్రూపుకు, నిస్సాన్ మోటార్ కంపెనీకు ఒప్పందం ఉన్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో హిందూజా గ్రూపుకు చెందిన ఇంజనీరింగ్ సర్వీసెస్స విభాగం 'డిఫియన్స్ టెక్నాలజీస్' (Defiance Technologies) నిస్సాన్‌తో కలిసి ఓ చిన్నకారును అభివృద్ధి చేసేందుకు పనిచేస్తున్నట్లు అశోక్ లేలాండ్ ఛైర్మన్ ధీరజ్ జి హిందూజా వెల్లడించారు.

అయితే, ఈ చిన్న కారు అభివృద్ధి విషయంలో అశోక్ లేలాండ్‌ (వాణిజ్య వాహనాల తయారీ యూనిట్)కు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని, అది నిస్సాన్ డొమైన్‌లోనే ఉంటుందని హిందూజా స్పష్టం చేశారు. నిస్సాన్ సహకారంతో అశోక్ లేలాండ్ ప్రస్తుత వాణిజ్య వాహనాల వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకుంటూ, విస్తరించుకునే దిశగా ముందుకు సాగుతామని ఆయన తెలిపారు.

తాము అభివృద్ధి చేస్తున్న చిన్న కారుకు సంబంధించి అంతకు మించిన వివరాలను ఆయన వెల్లడించలేదు. కాగా.. అశోక్ లేలాండ్ ఇటీవలే నిస్సాన్ ఇవాలియా ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేసిన బహుళ ప్రయోజనం వాహనం (ఎమ్‌పివి) స్టైల్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. ఈ ఏడాది పండుగ సీజన్‌లో ఈ వాహనాన్ని వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకువస్తామని కంపెనీ తెలిపింది.

More from DriveSpark

Article Published On: Thursday, July 18, 2013, 14:29 [IST]
English summary
Hinduja Group's partnership with Nissan Motor Company extends beyond its commercial vehicles brand Ashok Leyland. TOI reports that the Group's engineering services arm, Defiance Technologies is also working with Nissan towards developing a small car. The confirmation comes straight from Dheeraj Hinduja, chairman, Ashok Leyland, who stated the same to the news daily during an interview.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+