మైక్రా, సన్నీ, ఇవాలియా ధరలను పెంచిన నిస్సాన్

By Ravi

Nissan Evalia
జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా, దేశీయ విపణిలో అందిస్తున్న కొన్ని మోడళ్లను ధరలను పెంచింది. ఇన్‌పుట్ ధరలు పెరిగిన కారణంగా ఎంపిక చేసిన ఉత్పత్తుల ధరలను పెంచుతున్నామని, ఈ ధరల పెంపు అన్ని వేరియంట్లపై 1.5 శాతం నుంచి 2.5 శాతం రేంజ్‌లో ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. పెరిగిన ధరలు ఫిబ్రవరి 1, 2013 నుంచే అమల్లోకి వచ్చాయని కంపెనీ తెలిపింది.

తాజా ధరల పెంపుతో నిస్సాన్ ఎంట్రీ-లెవల్ స్మాల్ కార్ మైక్రా ధరలు 1.5 శాతం, మిడ్-సైజ్ సెడాన్ సన్నీ ధరలు 2 శాతం, యుటిలిటీ వెహికల్ ఇవాలియా ధరలు 2.5 శాతం మేర పెరిగినట్లు కంపెనీ వివరించింది. ఈ హోవర్ ఆటోమోటివ్ ఇండియా (నిస్సాన్ మోటార్ ఇండియా యొక్క నేషనల్ సేల్స్ కంపెనీ) డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) నితీష్ తిపిన్స్ మాట్లాడుతూ, గడచిన కొద్ది నెలల నుంచి తాను ఉత్పత్తుల ధరలను పెంచలేదని, ప్రస్తుతం పెరుగుతున్న ఇన్‌పుట్ ధరలకు కళ్లెం వేసేందుకు, అలాగే కరెన్సీ ఒడిదుడుకులను తట్టుకునేందుకు ఈ తాజా పెంపును ప్రకటిస్తున్నామని చెప్పారు.

హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా ఫిబ్రవరి 1 నుంచి తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కంపెనీ అందిస్తున్న చిన్న కారు ఇయాన్ మొదలుకొని ప్రీమియం ఎస్‌యూవీ శాంటాఫే వరకూ అన్ని మోడళ్ల ధరలను హ్యుందాయ్ పెచింది. ఈ ధరల పెంపు మోడల్‌ను బట్టి రూ.4,201 నుంచి రూ.20,878 రేంజ్‌లో ఉంది. పెరుగుతున్న ఉత్పాదక వ్యయం, కరెన్సీ ఒడిదుడుకులే ధరల పెంపుకు దారీ తీశాయని హ్యుందాయ్ మోటార్ ఇండియా వైస్ ప్రెసిడెండ్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేష్ శ్రీవాత్సవ తెలిపారు. ఈ కొత్త ధరలు ఫిబ్రవరి 1, 2013 నుంచే అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Monday, February 4, 2013, 17:14 [IST]
English summary
Nissan today announced a price increase for three of its models in India in response to rising input costs. The increase, which applies to all variants, ranges from 1.5% to 2.5% and will be effective from February 1, 2013. Prices for the hatchback Micra will go up by 1.5%, the mid-size sedan Sunny by 2% and the urban class utility vehicle, Evalia by 2.5%.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+