నిస్సాన్ డాట్సన్ నుంచి రానున్న ఐదు కొత్త కార్లు
జపనీస్ ఆటో దిగ్గజం నిస్సాన్ మోటార్ కార్పోరేషన్, 1986లో నిలిపివేసిన తమ పురాతన కార్ బ్రాండ్ 'డాట్సన్' (Datsun)కు తిరిగి ప్రాణం పోయనున్న సంగతి తెలిసినదే. రానున్న జులై నెలలో డాట్సన్ బ్రాండ్ గ్లోబల్ ప్రీమియర్‌ను ఇండియా నుంచే మొదలుపెట్టనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ సంజర్భంగా భారత మార్కెట్లో ఐదు డాట్సన్ కార్లను విడుదల చేస్తామని నిస్సాన్ ఇండియా పేర్కొంది.
ఇందులో మొదటి కారు ఐదు డోర్లు కలిగిన హ్యాచ్‌బ్యాక్ అని కంపెనీ వివరించింది. జులై 15న న్యూఢిల్లీలోని కింగ్‌డమ్ ఆఫ్ డ్రీమ్స్ వద్ద నిర్వహించనున్న డాట్సన్ గ్లోబల్ ప్రీమియర్ ఈ కారును ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన టీజర్ ఇమేజ్ ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తుంది. భారత మార్కెట్లో దీని ధర రూ.4 లక్షలకు దిగువన ఉండొచ్చని అంచనా.
డాట్సన్ బ్రాండ్ క్రింద నిస్సాన్ తక్కువ ధర కలిగిన కార్లను ఉత్పత్తి చేయనుంది. ఇండియా, రష్యా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా వంటి మార్కెట్లను లక్ష్యాంగా చేసుకొని నిస్సాన్ తమ డాట్సన్ కార్లను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఈ కారును కె2 అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేస్తున్నారు. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం ఇది శ్రేణిలో కెల్లా ఉత్తతమమైన స్థలాన్ని, మైలేజ్‌ను యాజమాన్యపు ఖర్చును ఆఫర్ చేయనుంది.



Click it and Unblock the Notifications








