తక్కువ ధర కలిగిన మైక్రాను సిద్ధం చేస్తున్న నిస్సాన్

By Ravi

జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ నిస్సాన్ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ మైక్రాలో ఓ తక్కువ ధర కలిగిన వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. హ్యుందాయ్ ఐ10, హోండా బ్రయో వంటి చిన్నకార్లను సవాల్ చేస్తూ కొత్త లో-కాస్ట్ నిస్సాన్ మైక్రా ఈ ఏడాది మార్చ్ నాటికి భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న నిస్సాన్ మైక్రాలో కొన్ని ఫీచర్లను తగ్గించి, తక్కువ ధరకే ఓ కారును అందించాలని నిస్సాన్ యోచిస్తోంది.

మనదేశంలో కాంపాక్ట్ కార్లకు, రూ.2.5 లక్షల నుంచి రూ.3.5 లక్షల ధర కలిగిన కార్లకు మంచి డిమాండ్ ఉంది. నిస్సాన్ ఇండియా ఇప్పటికే జి02ఏ అనే కోడ్‌ నేమ్‌తో ఈ లో-కాస్ట్ మైక్రాను దేశీయ రోడ్లపై టెస్టింగ్ నిర్వహిస్తోంది. ఈ టెస్టింగ్ దశ పూర్తవగానే కంపెనీ ఈ కారును మార్కెట్లో విడుదల చేసే ఆస్కారం ఉంది. ప్రస్తుతం నిస్సాన్ మైక్రా పెట్రోల్ బేస్ వేరియంట్ ధర రూ.4.23 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. కాగా.. మార్కెట్లోకి రానున్న చవక రకం మైక్రా ధర, దీని ధర కన్నా సుమారు రూ.50-70 వేలు తక్కువగా ఉండొచ్చని అంచనా. అంటే సుమారు రూ.3.5 లక్షల రేంజ్‌లో సరికొత్త మైక్రా అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది.

Micra

ఈ చవక రకం నిస్సాన్ మైక్రాలో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ప్రస్తుత మైక్రాలో ఉపయోగించిన ఇంజన్‌నే ఇందులో ఉపయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, చవక మైక్రా కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తుందా లేక డీజిల్ వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉంటుందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. పెట్రోల్ వేరియంట్ నిస్సాన్ మైక్రాలో 1.2 లీటర్, డిఓహెచ్‌సి, 12-వాల్వ్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 76 పిఎస్‌ల శక్తిని, 104 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 18.06 కి.మీ. మైలేజీనిస్తుంది.

ఇకపోతే డీజిల్ వేరియంట్‌ నిస్సాన్ మైక్రాలో 1.5 లీటర్, ఎస్ఓహెచ్‌సి, 8-వాల్వ్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 64 పిఎస్‌ల శక్తిని, 160 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 23.08 కి.మీ. మైలేజీనిస్తుంది. ఈ రెండు వేరియంట్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తాయి. నిస్సాన్ మైక్రాలో పవర్ స్టీరింగ్, స్టీరింగ్ టిల్ట్ అడ్జస్టమెంట్, పవర్ విండోస్, సెంట్రల్ డోర్ లాంక్, పుష్ బటన్ స్టార్ట్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో వివిధ వేరియంట్లలో లభించే నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్ ధరలు ఈ విధంగా ఉన్నాయి:

  • నిస్సాన్ మైక్రా ఎక్స్ఈ (పెట్రోల్) - రూ.4.23 లక్షలు
  • నిస్సాన్ మైక్రా ఎక్స్ఈ ప్లస్ (పెట్రోల్) - రూ.4.51 లక్షలు
  • నిస్సాన్ మైక్రా ఎక్స్ఎల్ (పెట్రోల్) - రూ.4.86 లక్షలు
  • నిస్సాన్ మైక్రా ఎక్స్‌వి (పెట్రోల్) - రూ.5.53 లక్షలు
  • నిస్సాన్ మైక్రా ఎక్స్‌వి (డీజిల్) - రూ.5.98 లక్షలు
  • నిస్సాన్ మైక్రా ఎక్స్‌వి ప్రీమియం (డీజిల్) - రూ.6.43 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

More from DriveSpark

Article Published On: Monday, January 28, 2013, 17:14 [IST]
English summary
Nissan, the Japanese carmaker which started its India operations by launching the Micra hatchback in 2010 is looking at the same car to boost its sales volumes in 2013. Nissan India is reportedly planning to launch a low priced version of the Micra to take on competitors such as the Hyundai i10 and Honda Brio.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+