నిస్సాన్ మైక్రా ఇప్పుడు రూ.3.99 లక్షలు మాత్రమే

అయితే, ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని నిస్సాన్ ఆకర్షనీయమైన ధరకే తమ బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది. నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మొత్తం ఆరు వేరియంట్లలో (4 పెట్రోల్, 2 డీజిల్) లభ్యమవుతుంది. ఇందులో ప్రైమో అనే స్పెషల్ ఎడిషన్‌ను కూడా నిస్సాన్ అందిస్తోంది. పెట్రోల్ వేరియంట్ నిస్సాన్ మైక్రాలో 1.2 లీటర్, డిఓహెచ్‌సి, 12-వాల్వ్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 76 పిఎస్‌ల శక్తిని, 104 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 18.06 కి.మీ. మైలేజీనిస్తుంది.
ఇకపోతే డీజిల్ వేరియంట్ నిస్సాన్ మైక్రాలో 1.5 లీటర్, ఎస్ఓహెచ్‌సి, 8-వాల్వ్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 64 పిఎస్‌ల శక్తిని, 160 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 23.08 కి.మీ. మైలేజీనిస్తుంది. ఈ రెండు వేరియంట్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తాయి. నిస్సాన్ మైక్రా కేవలం 4.6 మీటర్ల టర్నింగ్ రేడియస్‌ను మాత్రమే కలిగి ఉండి మంచి చిన్న రోడ్లపై సైతం సౌకర్యవంతంగా డ్రైవ్ చేసేందుకు సహకరిస్తుంది.
ఇందులో పవర్ స్టీరింగ్, స్టీరింగ్ టిల్ట్ అడ్జస్టమెంట్, పవర్ విండోస్, సెంట్రల్ డోర్ లాంక్, పుష్ బటన్ స్టార్ట్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. వివిధ వేరియంట్లలో లభించే నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్ ధరలు ఈ విధంగా ఉన్నాయి:
* నిస్సాన్ మైక్రా ఎక్స్ఈ (పెట్రోల్) - రూ.4.23 లక్షలు
* నిస్సాన్ మైక్రా ఎక్స్ఈ ప్లస్ (పెట్రోల్) - రూ.4.51 లక్షలు
* నిస్సాన్ మైక్రా ఎక్స్ఎల్ (పెట్రోల్) - రూ.4.86 లక్షలు
* నిస్సాన్ మైక్రా ఎక్స్‌వి (పెట్రోల్) - రూ.5.53 లక్షలు
* నిస్సాన్ మైక్రా ఎక్స్‌వి (డీజిల్) - రూ.5.98 లక్షలు
* నిస్సాన్ మైక్రా ఎక్స్‌వి ప్రీమియం (డీజిల్) - రూ.6.43 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)


Click it and Unblock the Notifications








