భారత్‌లో మైక్రా, సన్నీ కార్లను రీకాల్ చేసిన నిస్సాన్
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ ఇండియా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఫ్లాగ్‌షిప్ మోడల్స్ మైక్రా హ్యాచ్‌బ్యాక్, నిస్సాన్ సెడాన్లను రీకాల్ చేస్తున్న కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ కార్లలో మాస్టర్ బ్రేక్ సిలిండర్ల కారణంగా వీటిని వెనక్కు పిలిపిస్తున్నామని, ఈ లోపపూరిత విడిభాగాన్ని ఉచితంగా రీప్లేస్ చేస్తామని కంపెనీ పేర్కొంది.
మొత్తం 22,188 మైక్రా, సన్నీ కార్లలో ఈ సమస్యను గుర్తించామని, ఈ నెలలో సమస్య ఉన్న కార్లను గుర్తించడం ప్రారంభించామని, ఈ సమస్య గురించి కస్టమర్లకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నామని కంపెనీ ఆ ప్రకటనలో తెలిపింది. నిస్సాన్ డీలర్లు ఈ మాస్టర్ బ్రేక్ సిలిండర్‌ను కస్టమర్ నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండా, ఉచితంగా రీప్లేస్ చేస్తారని నిస్సాన్ ఇండియా వెల్లడించింది.

వినియోగదారులకు పూర్తిస్థాయి భద్రతతో కూడిన ఉత్పత్తులను మరియు సంతృప్తితో కూడిన సర్వీస్‌ను అందించడానికి నిస్సాన్ కట్టుబడి ఉంటుందని, ఈ దిశలో భాగంగానే లోపపూరిత మాస్టర్ బ్రేక్ సిలిండర్‌ను ఉచితంగా రీప్లేస్ చేస్తున్నామని కంపెనీ తెలిపింది. గతంలో ఇదే సమస్యపై ఆసియా, ఆఫ్రికా మరియు యూరప్ ఖండాల నుంచి మొత్తం 67,089 కార్లను నిస్సాన్ రీకాల్ చేసింది.
కాగా.. ఈ సమస్యల వలన ఇంతవరకూ ఎలాంటి ప్రమాదం జరగలేదని, ముందస్తు భద్రత చర్యలో భాగంగా ఈ రీకాల్‌ను ప్రకటించామని నిస్సాన్ ఇండియా తెలిపింది. ఇదిలా ఉండగా, వచ్చే ఏడాది భారత్‌లో లక్ష కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ దిశలో భాగంగా రానున్న రోజుల్లో 4 కొత్త కార్లను మార్కెట్లో విడుదల చేస్తామని, పల్స్/మైక్రా, సన్నీ/స్కాలా కార్ల మాదిరిగా కాపీ ఉత్పత్తులను తయారు చేయబోమని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








