నిస్సాన్ మైక్రా, రెనో పల్స్ ప్లాట్‌ఫామ్‌పై కాంపాక్ట్ సెడాన్

By Ravi

ఇటీవల బడ్జెట్‌లో సవరించబడిన ఎక్సైజ్ డ్యూటీ కార్ల తయారీదారులకు శాపంగా మారింది. నాలుగు మీటర్ల కన్నా పొడవు కలిగిన కార్లను పెద్ద కార్లుగా పరిగణించి, వాటిపై అధనపు ఎక్సైజ్ సుంకాలను వసూలు చేస్తుండటంతో తయారీదారులు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే, నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవు కలిగిన కాంపాక్ట్ సెడాన్లను తయారు చేస్తున్నారు.

ఈ సెగ్మెంట్లో ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్‌లో తమ కాంపాక్ట్ సెడాన్లతో మంచి సక్సెస్‌ను సాధించిన సంగతి తెలిసినదే. ఈ సక్సెస్‌ను టెంప్ట్ అయిన జపాన్-ఫ్రెంచ్ భాగస్వామ్య కంపెనీ నిస్సాన్-రెనో ఓ కాంపాక్ట్ సెడాన్‌ను అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ రెండు సంస్థలు అందిస్తున్న మైక్రా, పల్స్ హ్యాచ్‌బ్యాక్‌ల ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఓ కొత్త కాంపాక్ట్ సెడాన్‌ను తీసుకురానున్నారు.

Nissan Micra

అంటే, త్వరలోనే నిస్సాన్ మైక్రా, రెనో పల్స్ హ్యాచ్‌బ్యాక్‌లు సెడాన్ రూపంలో బూట్‌ను తగిలించుకొని రానున్నాయన్నమాట. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఇప్పటికీ ఈ కాంపాక్ట్ సెడాన్ డిజైన్ అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి నిస్సాన్-రెనో కంపెనీలకు కాంపాక్ట్ సెడాన్ చక్కగా పనిచేస్తుంది. ప్రస్తుతం మైక్రా, పల్స్ హ్యాచ్‌బ్యాక్‌ల తర్వాత కేవలం సన్నీ, స్కాలా సెడాన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, నిస్సాన్-రెనో సరసమైన ధరకే కాంపాక్ట్ సెడాన్‌ను ప్రవేశపెడితే, అది మంచి సక్సెస్‌ను సాధించడం ఖాయం. మీరేమంటారు..?

More from DriveSpark

Article Published On: Tuesday, August 27, 2013, 16:15 [IST]
English summary
The success of Swift DZire and Honda Amaze has reportedly tempted the Nissan-Renault alliance into developing a compact sedan. A sub-4 meter Micra and Pulse with an added boot. The Telegraph states, citing an unnamed source from the design department of one of the automakers, that sedan version of the hatchbacks are being developed, but concrete designs have not been finalized.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+