సాలీనా రూ.6 లక్షలు సంపాధించే వారికే కార్ లోన్: ఎస్‌బిఐ

భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) వాహన రుణం కోసం శాలరీ లిమిట్‌ను పెంచుతున్నట్లు ఈనెల ఆరంభంలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. కంపెనీ ఇప్పుడు ఇదే విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. వార్షిక ఆదాయం రూ.6 లక్షల కన్నా తక్కువవుండే వారికి కార్ లోన్ ఇవ్వబోమని ఎస్‌బిఐ స్పష్టం చేసింది. ఈ మేరకు కారు లోన్ ఎలిజబిలిటీ నిబంధనలను బ్యాంక్ కఠినతరం చేసింది.

ఇదివరకు వార్షికంగా రూ.2.5 లక్షలు సంపాధించే వారికి కపెనీ కార్ లోన్ మంజూరు చేసేంది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.6 లక్షలకు పెంచింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎస్‌బిఐ బ్యాంక్ ఒక సర్క్యులర్ కూడా జారీ చేసింది. డిఫాల్ట్ అవకాశాలను తగ్గించుకునే ఉద్దేశంతో ఇందుకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేసినట్లు బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.

Car Loan

ఈ పరిమితి ఎస్‌బిఐలో కాకుండా వేరే ఇతర బ్యాంకులో ఖాతా కలిగి ఉన్న వారికి మాత్రమే. అదే ఎస్‌బిఐలో ఖాతా కలిగి ఉన్న వారికైతే, వార్షికంగా రూ.4.5 లక్షల ఆదాయం ఉంటే సరిపోతుంది. ఎస్‌బిఐ ప్రస్తుతం 10.45 శాతం వడ్డీరేటు వద్ద కార్ లోన్స్ ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం సగటు వ్యక్తుల ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండటంతో, భవిష్యత్తులో రుణాలను కట్టకుండా ఎగవేయటం వలన సంభవించే నష్టాల నుంచి తప్పించుకునేందుకే ఎస్‌బిఐ ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, September 13, 2013, 10:00 [IST]
English summary
Individuals with annual income of less than Rs. 6 lakh will not get a car loan from State Bank of India (SBI) as the bank has tightened eligibility conditions for its four-wheeler loan scheme with a view to minimising possible defaults.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+