ఆ కారు కొనడానికి నా దగ్గర డబ్బుల్లేవ్: రతన్ టాటా

జెనీవాలో జరుగుతున్న 83వ అంతర్జాతీయ మోటార్ షోలో ఇటాలియన్ స్పోర్ట్స్ కార్ కంపెనీ ఫెరారీ ఆవిష్కరించిన అధునాత 'లాఫెరారీ' హైబ్రిడ్ సూపర్‌కారు మన రతన్ టాటాను ఎంతగానో ఆకట్టుకుంది. ఫెరారీ మొట్టమొదటి హైబ్రిడ్ కారు చూడటానికి 'అద్భుతం'గా ఉందని రతన్ టాటా వ్యాఖ్యానించారు. మరి ఇలాంటి ఓ కారును కొంటారా అని రతన్ టాటాను ఫెరారీ ఛైర్మన్ లుకా కోర్డియో డి మోంటెజెమోలో ప్రశ్నించగా, తన వద్ద అంత డబ్బు లేదని టాటా సరదాగా సమాధానమిచ్చారు. వీరిద్దరూ మంచి మిత్రులు.

లాఫెరారీ విషయానికి వస్తే, ఫెరారీ ఎన్జో మోడల్‌కు సక్సెసర్‌గా వచ్చిన కారే ఇది. ఇదొక హైబ్రిడ్ కారు. ఇది డ్యూయెల్ పవర్ (పెట్రోల్ + బ్యాటరీ)తో పనిచేస్తుంది. లాఫెరారీ హైపర్‌కారులో 6.3 లీటర్ వి12 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 9000 ఆర్‌పిఎమ్ వద్ద 800 హెచ్‌పిల గరిష్ట శక్తిని, 7000 ఆర్‌పిఎమ్ వద్ద 700 ఎన్‌ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇందులో అమర్చిన 120 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ 163 హెచ్‌‌పిల గరిష్ట శక్తిని, 270 ఎన్‌ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్లు రెండు కలిసి గరిష్టంగా 963 హెచ్‌పిల శక్తిని విడుదల చేస్తాయి.

లాఫెరారీ హైపర్‌కారు కేవలం 3 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. అలాగే 15 సెకండ్లలో 0-300 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఫెరారీ కంపెనీ కేవలం 499 లాఫెరారీ కార్లను ఉత్పత్తి చేయనుంది. అయితే దీని ధరను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఇది 10 లక్షల యూరోలకు పైగా ఉండొచ్చని అంచనా. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.7 కోట్లకు పైమాటే.

లాఫెరారీ హైబ్రిడ్ కారు

లాఫెరారీ హైబ్రిడ్ కారు

లాఫెరారీ హైబ్రిడ్ కారు

లాఫెరారీ హైబ్రిడ్ కారు

లాఫెరారీ హైబ్రిడ్ కారు

లాఫెరారీ హైబ్రిడ్ కారు

లాఫెరారీ హైబ్రిడ్ కారు

లాఫెరారీ హైబ్రిడ్ కారు

లాఫెరారీ హైబ్రిడ్ కారు

లాఫెరారీ హైబ్రిడ్ కారు

లాఫెరారీ హైబ్రిడ్ కారు

లాఫెరారీ హైబ్రిడ్ కారు

లాఫెరారీ హైబ్రిడ్ కారు

లాఫెరారీ హైబ్రిడ్ కారు

లాఫెరారీ హైబ్రిడ్ కారు

లాఫెరారీ హైబ్రిడ్ కారు

లాఫెరారీ హైబ్రిడ్ కారు

లాఫెరారీ హైబ్రిడ్ కారు

లాఫెరారీ హైబ్రిడ్ కారు

లాఫెరారీ హైబ్రిడ్ కారు

లాఫెరారీ హైబ్రిడ్ కారు

లాఫెరారీ హైబ్రిడ్ కారు

లాఫెరారీ హైబ్రిడ్ కారు

లాఫెరారీ హైబ్రిడ్ కారు

లాఫెరారీ హైబ్రిడ్ కారు

లాఫెరారీ హైబ్రిడ్ కారు

లాఫెరారీ హైబ్రిడ్ కారు

లాఫెరారీ హైబ్రిడ్ కారు

లాఫెరారీ హైబ్రిడ్ కారు

లాఫెరారీ హైబ్రిడ్ కారు

More from DriveSpark

Article Published On: Thursday, March 7, 2013, 12:11 [IST]
English summary
Ratan Tata adored the new hybrid Ferrari car, the LaFerarri at the 2013 Geneva Motor Show. Tata said that Ferarri’s first-ever hybrid looks “terrific”. Asked if will he buy one, Tata joked that, "he does not have the money".
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+