అఫీషియల్: జూన్ 26న ఫోర్డ్ ఈకోస్పోర్ట్ విడుదల

By Ravi

అదిగో ఇదిగో అంటూ కార్ ప్రియులను ఊరిస్తున్న వచ్చిన ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ ఎట్టకేలకు ఈనెల 26న మార్కెట్లో వాణిజ్య పరంగా విడుదల కానుంది. ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని జూన్ 26, 2013న మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ఫోర్డ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు మీడియా మిత్రులకు ఆహ్వానాలను కూడా పంపించింది.

ఫోర్డ్ ఇండియా అదీకృత డీలర్లు ఇప్పటికే ఈకోస్పోర్ట్ బుకింగ్‌లను అధికారికంగా ప్రారంభించారు. కేవలం రూ.50,000 అడ్వాన్సుకే ఈ మోడల్‌ను బుక్ చేస్తున్నారు. ముందుగా వచ్చిన వారికి ముందుగా డెలివరీ అనే ప్రాతిపధికన ఈ మోడల్ డెలివరీ సాగనున్నాయి. జూన్ 26, 2013న ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరలను వెల్లడించున్నారు.

ఈ నేపథ్యంలో, ఈకోస్పోర్ట్ ధరలపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఎంట్రీ లెవల్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వేరియంట్ ధర రూ.6 లక్షల రేంజ్‌లోను టాప్-ఎండ్ వేరియంట్ ఈకోస్పోర్ట్ ధర రూ.9 లక్షల రేంజ్‌లోను ఉండొచ్చని అంచనా. ఇదే గనుక నిజమైనతే కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో మరోసారి ధరల యుద్ధం మొదలవ్వటం ఖాయం.

Ford EcoSport

ఇది ఈ సెగ్మెంట్లో నేరుగా రెనో డస్టర్ కాంపాక్ట్ ఎస్‌యూవీతో పోటీ పడనుంది. భారత మార్కెట్లో ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో (ఆంబీంటే, ట్రెండ్, టైటానియం, టైటానియం ఆప్షనల్) లభ్యం కానుంది. ఇందులో మూడు ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి. అందులో ఒకటి 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ కాగా, మరొకటి 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, వేరొకటి 1.0 ఫోర్డ్ ఈకోబూస్ట్ ఇంజన్. ఈకోబూస్ట్ ఇంజన్ కలిగిన వేరియంట్ కేవలం టాప్ ఎండ్ వేరియంట్లో మాత్రమే లభ్యం కానున్నట్లు సమాచారం. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, June 20, 2013, 12:25 [IST]
English summary
Ford India has finally announced that the much anticipated Ford EcoSport Compact SUV will be launched on June 26, 2013. Stay tuned to www.drivespark.com for all new updates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+