లీటరుకు రూ.2 చొప్పున తగ్గిన పెట్రోల్ ధర

తగ్గిన పెట్రోల్ ధరలు శుక్రవారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. పెట్రోలియం మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, పెట్రోల్ యొక్క సింగపూర్ బెంచ్‌మార్క్ ఎఫ్ఓబి (ఫ్రైట్ ఆన్ బోర్డ్) బ్యారెల్‌పై మార్చిన 1న 123.54 డాలర్లుగా ఉన్న ధర మార్చి 13 నాటికి 120.43 డాలర్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలో, చమురు కంపెనీలు కూడా భారత్‌లో పెట్రోల్ ధరలను తగ్గించాయి. తాజా తగ్గింపు తర్వాత దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి:
* ఢిల్లీ - రూ.68.34
* ముంబై - రూ.75.14
* కలకత్తా- రూ.75.84
* చెన్నై - రూ.71.41
* హైదరాబాద్ - రూ.74.59
* బెంగుళూరు - రూ.75.26


Click it and Unblock the Notifications








