టాటా ప్లాంటులో టాటా కార్లకు మాత్రమే పార్కింగ్ సౌకర్యం

By Ravi

Tata Car
'ఏమి అనుకోకుండా మీ మారుతి కారును బయట పార్క్ చేయండి ప్లీజ్..' ఇది ప్రస్తుతం టాటా మోటార్స్ ప్లాంట్‌‍లో పరిస్థితి. టాటా మోటార్స్ పూనే ప్లాంటులో పనిచేస్తున్న ఉద్యోగులకు టాటా కార్లను ఉంటేనే ప్లాంటు లోపలి వైపు పార్క్ చేసేందుకు కంపెనీ అనుమతిస్తుంది. టాటా కారు కాకుండే వేరే ఏ కారు వేసుకొని ప్లాంటుకు వచ్చినా సదరు కారును బయటే పార్క్ చేయాల్సిందిగా ప్లాంట్ యాజమాన్యం తమ ఉద్యోగులకు ఓ సర్క్యులర్ పంపింది.

తమ స్వంత వాహనాలను ఉద్యోగుల ద్వారా ప్రమోట్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇలా చేయటం వలన వర్కర్లు గర్వపడుతారని కంపెనీ పేర్కొంది. ఈ తరహా నిర్ణయం తీసుకుంది కేవలం టాటా మోటార్స్ మాత్రమే కాదు. గడచిన కొద్ది సంవత్సరాలుగా హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తుంది. మరికొన్ని కార్ కంపెనీలు తమ కార్లను ప్రమోట్ చేసేందుకు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు 30 శాతం వరకు డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నాయి.

బ్రాండ్ ఇమేజ్‌ను ప్రమోట్ చేసేందుకు, టాటా మోటార్స్ భాగమయ్యేందుకు, ఉద్యోగులంతా టాటా వాహనాలను కలిది ఉండేలా ప్రోత్సహించేందుకే కంపెనీ యాజమాన్యం నిర్ణయించిందని, ఈ నేపథ్యంలో ఇందుకు కట్టుబడి ఉండే దిశలో తొలి అడుగుగా కేవలం టాటా వాహనాలను మాత్రమే ప్లాంటులోకి అనుమతించాలని, ఇతర వాహనాలను వెలుపలి వైపు (వాణిజ్య వాహనాల బిజినెస్ యూనిట్) ఉన్న పార్కింగ్ ప్రదేశంలో పార్క్ చేసేలా నిర్ణయం తీసుకోవటమైనది టాటా మోటార్స్ పూనే ప్లాంటులోని ఓ సర్క్యులర్‌లో పేర్కొనడం జరిగింది.

More from DriveSpark

Article Published On: Tuesday, June 18, 2013, 14:18 [IST]
English summary
Tata Motors has decided to restrict their employees from parking othr brand vehicles in their parking area. To promote brand image and demonstrate pride of being part of Tata Motors, the management has encouraged all the employees to own a Tata Vehicle. As our commitment to further this cause, as a first step, we shall only Tata Vehicles to enter the premises. All the non-Tata Vehicles will have to be parked outside the (commercial vehicle business unit) CVBU gate in a parking lot” - a circular at the Tata Motors Pune plant states.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+