మీ కారుతో ఫార్ములా వన్ రేస్ ట్రాక్‌పై రైడ్ చేయండి
రేస్ ట్రాక్‌పై కారు లేదా బైక్ నడపాలనే మీ కలను నిజం చేసేందుకు ఢిల్లీలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (బిఐసి) ముందుకు వచ్చింది. సాధారణ ప్రజల (జనరల్ పబ్లిక్) కోసం బిఐసి ఫిబ్రవరి 17, 20313న 'బిఐసి టైమ్ ట్రైల్' (ఓపెన్ ట్రాక్ డే)ను నిర్వహించనుంది. మీ డ్రైవింగ్ స్కిల్స్‌ను పరీక్షించుకునేందుకు, వేగం అంటే ఇష్టపడే స్పీడ్ లవర్స్‌కు ఇదొక చక్కని అవకాశం. ఈ ఓపెన్ ట్రాక్ డే బైక్, కార్ విభాగాలకు వర్తిస్తుంది.
ఈ ఫార్ములా వన్ సర్క్యూట్‌పై గుండెలు జారిపోయే వేగంతో మీ వాహనాలను పరుగులు పెట్టించాలంటే, అందుకు మీరు చేయాల్సిందల్లా మీరు స్వంత వాహనం, చెల్లుబాటైన వాహనాన్ని కలిగి ఉంటే సరిపోతుంది. ఇందుకు మీరు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక గంట సమయం పాటు సాగే ఈ సెషన్ పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ ఫీజు కారుకు రూ.4,000, బైక్‌కు రూ.3,000 లుగా ఉంటుంది. ఒకవేళ మూడు సెషన్లను (మూడు గంటల పాటు) ఉపయోగించుకున్నట్లయితే, నాల్గవ సెషన్‌ను ఉచితంగా ఆఫర్ చేస్తారు.
మూడు సెషన్లకు అయ్యే ఖర్చు కారుకు రూ.12,000, బైక్‌కు రూ.9,000 లుగా ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చే అభిమానులు మెర్సిడెస్ బెంజ్ ఎల్ఎస్ఎస్ (ట్విన్ సీటర్), సి-క్లాస్, ఈ-క్లాస్, ఎమ్ఎల్-క్లాస్ కార్లలో టాక్సీ రైడ్‌ను ఎంజాయ్ చేయవచ్చు. ఎస్ఎల్ఎస్ స్పోర్ట్స్ కారులో ఒక్క రైడ్‌కు రూ.7500 (ప్రతి వ్యక్తికి), ఇతర బెంజ్ కార్లలో రైడ్‌కు రూ.1,500 (ప్రతి వ్యక్తికి) లను వసూలు చేస్తారు.



Click it and Unblock the Notifications








