ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా టాటా నానో విక్రయాలు!
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న ప్రజల కారు టాటా నానో అమ్మకాలను పెంచుకునేందుకు గడచిన కొద్ది కాలంగా కంపెనీ వివిధ రకాల మార్కెటింగ్ ప్రణాళికలను నిర్వహిస్తున్న సంగతి తెలిసినదే. ఎక్సేంజ్ ఆఫర్స్, ఆకర్షనీయమైన ఫైనాన్స్ ఆఫర్స్, క్రెడిట్ కార్డ్ స్కీమ్, అధనపు వారంటీ, లో ఈఎమ్ఐ వంటి అనేక పథకాలను టాటా మోటార్స్ ప్రవేశపెట్టింది.
తాజా సమాచారం ప్రకారం, ఆన్‌లైన్ ద్వారా టాటా నానోను విక్రయించేందుకు కూడా కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. నానో తక్కువ ధర కలిగిన కారు కావటంతో, ఈ విధానం ద్వారా విక్రయించేందుకు ఇది అనువైన మార్గమని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా టాటా మోటార్స్ కొన్ని యూనిట్లను ప్రయోగాత్మకంగా విక్రయించినట్లు సమాచారం. ఈ విషయంపై టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్) రంజిత్ యాదవ్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ అబ్బాయిలు / అమ్మాయిల కోసం ఈ విధానంలో నానోను కొనుగోలు చేసిన సందర్భాలున్నాయని అన్నారు.

టాటా నానోను ఆన్‌లైన్ ద్వారా విక్రయించడం ద్వారా, కస్టమర్ ఇంటి వద్దనే కారును డెలివరీ చేయటం లేదా సమీపంలోని టాటా మోటార్స్ డీలర్‌షిప్ వద్ద కస్టమర్‌కు డెలివరీ చేయటం చేసే వీలుంటుంది. దీన్నిబట్టి చూస్తుంటే, త్వరలోనే నానోను ఇంటర్నెట్‌లో కొనుక్కోవచ్చన్నమాట.
టాటా నానో విషయానికి వస్తే, ఇందులో అమర్చిన 624 సీసీ ఇంజన్ 38 పిఎస్‌ల శక్తిని, 51 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు పెట్రోలుకు 25 కిలోమీటర్ల వరకు మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








