రూ.7.99 లక్షల ప్రారంభ ధరకే నిస్సాన్ ఇవాలియా

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న మొట్టమొదటి ఎమ్‌పివి ఇవాలియాను ఇప్పుడు కేవలం రూ.7.99 లక్షల ప్రారంభ ధరకే (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) విక్రయిస్తోంది. గడచి కొద్ది నెలలుగా ఇవాలియా అమ్మకాలు ఆశించిన రీతిలో సాగటం లేదు. గడచిన రెండు త్రైమాసికాల్లో కేవలం 900 యూనిట్ల నిస్సాన్ ఇవాలియా కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి.

ఇదే సమయంలో చెవర్లే ఎంజాయ్ ప్రతినెలా 2500 బుకింగ్‌లను, మారుతి ఎర్టిగా 5000 బుకింగ్‌లను అందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో, ఇవాలియా అమ్మకాలను పెంచుకునేందుకు కంపెనీ ఈ మోడల్‍‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. ఇందులో భాగంగానే ఇవాలియా ధరను సుమారు రూ.1.15 లక్షలు తగ్గించి విక్రయిస్తోంది.


టొయోటా ఇన్నోవా, మహీంద్రా జైలో, మారుతి ఎర్టిగా వంటి మోడళ్లకు ధీటుగా నిస్సాన్ తమ జైలోను ప్రవేశపెట్టింది. అయితే, ఈ మోడల్ మార్కెట్లో ఆశించిన సక్సెస్‌ను సాధించలకపోయింది. అధిక ధర, ఆకట్టుకోని డిజైన్, నాణ్యత లేని ఇంటీరియర్స్ వంటి అంశాల కారణంగా ప్రధానంగా ఇది విఫలమైనందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే నిస్సాన్ ఓ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఇవాలియాను అభివృద్ధి చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.

ఇందులో భాగంగానే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న నిస్సాన్ ఇవాలియా స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు ప్రస్తుత వెర్షన్ ఇవాలియాను కేవలం రూ.7.99 లక్షల ప్రారంభ ధరకే విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.


ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న నిస్సాన్ ఇవాలియాలో 1.5 లీటర్ టర్బోఛార్జ్‌డ్ కె9కె డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 3750 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 1900 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ (గేర్ బాక్స్) కలిగిన నిస్సాన్ ఇవాలియా లీటర్ డీజిల్‌కు సుమారు 20 కి.మీ. మైలేజీనిస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 1, 2013, 17:31 [IST]
English summary
Japanese car maker Nissan India tweeted earlier today that their Evalia MPV is now available at a special price of Rs 7.99 lakh. If this is true, then it implies that Evalia MPV price has been slashed by about Rs 1.15 lakh.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+