చెన్నైలో పాజెరో స్పోర్ట్ వార్షికోత్సవ ఎడిషన్ విడుదల
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మిత్సుబిషి గత జులై నెలలో భారత మార్కెట్ల విడుదల చేసిన 'పాజెరో స్పోర్ట్ యానివర్స్‌రీ ఎడిషన్' కారును తాజాగా చెన్నై మార్కెట్లో విడుదల చేసింది. మిత్సుబిషి గడచిన సంవత్సరం తమ పాపులర్ ప్రీమియం ఎస్‌యూవీ 'పాజెరో స్పోర్ట్'ను దేశీయ విపణిలో ప్రవేశపెట్టింది. ఈ ఎస్‌యూవీని భారత్‌లోకి ప్రవేశించి ఏడాది పూర్తయిన సందర్భంగా కంపెనీ ఇందులో వార్షికోత్సవ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది.
రెగ్యులర్ వెర్షన్ పాజెరో స్పోర్ట్‌తో పోల్చుకుంటే యానివర్సరీ ఎడిషన్ పాజెరో స్పోర్ట్ మరిన్ని అధనపు పీచర్లతో లభ్యం కానుంది. మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ యానివర్సరీ ఎడిషన్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు, కొద్దిపాటి కాస్మోటిక్ మార్పులు మాత్రమే ఉన్నాయి.

ఇందులో కొత్తగా జిపిఎస్ నావిగేషన్‌తో కూడిన టచ్‌స్క్రీన్ మల్టీమీడియా ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రియర్ వ్యూ కెమెరా, రియర్ స్పాయిలర్, బాడీ కలర్డ్ బంపర్స్, మడ్ గార్డ్, యానివర్సరీ ఎడిషన్ బాడీ డెకాల్ (స్టిక్కర్స్) వంటి ఫీచర్లను జోడించారు.
కొత్త మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ యానివర్సరీ ఎడిషన్‌లో కంపెనీ సూపర్ సెలక్ట్ ఫోర్-వీల్ డ్రైవ్ (4×4) సిస్టమ్‌ను ఆఫర్ చేస్తుంది. మంచి మైలేజ్ కోరుకునే వారు టూ-వీల్ డ్రైవ్ (4×2)ను ఎంచుకోవచ్చు లేదా ఆఫ్ రోడింగ్ ప్రియుల కోసం, టెర్రైన్‌ను బట్టి 3 రకాల 4×4 మోడ్‌లు అందుబాటులో ఉంటాయి.
చెన్నై మార్కెట్లో మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ యానివర్సరీ ఎడిషన్ ధర రూ.28.39 లక్షలు (ఎక్స్-షోరూమ్, చెన్నై)గా ఉంది.

మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ యానివర్సరీ ఎడిషన్‌లో ఇదివరకటి 2.5 లీటర్ డీజిల్ ఇంజన్‌నే ఉపయోగించారు. ఇది గరిష్టంగా 178 బిహెచ్‌పిల శక్తిని, 400 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది.


Click it and Unblock the Notifications








