లీటరుకు రూ.4 తగ్గిన పెట్రోల్ ధర; డీజిల్‌పై 50 పైసల పెంపు

By Ravi

మొత్తానికి పెట్రోల్ ధరలు దిగొచ్చాయి. గడచిన జూన్ నెల నుంచి వరుసగా ఏడు సార్లు పెరిగిన పెట్రోల్ ధరలు, ఇప్పుడు దిగొచ్చాయి. అమెరికన్ డాలరుతో పోల్చుకుంటే, రూపాయి విలువ బలపడటంతో, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు లీటరు పెట్రోల్‌పై రూ.3.05 చొప్పున తగ్గింపును (స్థానిక పన్నులు కలుపుకోకుండా) ప్రకటించాయి. పన్నులు కలుపుకుంటే, ఈ తగ్గింపు రూ.4 వరకు ఉంటుంది.

చమురు కంపెనీలు మే 1, 2013న పెట్రోల్ ధరను రూ.3 మేర తగ్గించాయి (గత ఐదేళ్లలో ఇంత భారీగా తగ్గించడం ఇదే మొదటిసారి). ఆ తర్వాత జూన్ 2013 నుంచి పెట్రోల్ ధరను వరుసగా మొత్తంగా ఏడు సార్లు రూ.10.80 చొప్పున (పన్నులు కలుపుకోకుండా) పెంచాయి. పన్నులు కలుపుకుంటే ఈ పెంపు లీటరుకు రూ.13.06గా ఉంటుంది. కాగా, తాజాగా తగ్గిన పెట్రోల్ ధర ఈరోజు అర్థరాత్రి (సోమవారం, సెప్టెంబర్ 30, 2013) నుంచి అమల్లోకి రానుంది.

ఇదిలా ఉండగా, డీజిల్‌పై సబ్సిడి భారాన్ని తగ్గించుకునేందుకు గాను ప్రతినెలా డీజల్ ధరను స్వల్పంగా పెంచుతున్నట్లుగానే, ఈసారిగా లీటరుపై 50 పైసల చొప్పున ధరను పెంచుతున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి.

Petrol Price Cut

More from DriveSpark

Article Published On: Monday, September 30, 2013, 21:38 [IST]
English summary
Petrol price was on Monday cut by Rs 3.05 per litre, the first reduction in rates in over five months and the steepest in over five years, while diesel prices were raised by 50 paise a litre.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+