తగ్గిన పెట్రోల్ ధర; డీజిల్ ధరలో నో ఛేంజ్!

By Ravi

వాహన చోదకులకు మరొక స్వీట్ న్యూస్. పెట్రోల్ ధరలు ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయ మార్కెట్లో కూడా పెట్రోల్ ధరలను తగ్గిస్తున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. ఈ మేరకు ప్రతి లీటరు పెట్రోల్‌పై రూ.1 చొప్పున తగ్గింపును అందిస్తున్నట్లు చమురు కంపెనీలు పేర్కొన్నాయి. ఈనెల ఆరంభంలో (ఏప్రిల్ 1, 2013న) కూడా చమురు కంపెనీ పెట్రోల్ ధరను లీటరుకు ఒక్క రూపాయి చొప్పున తగ్గించిన సంగతి తెలిసినదే.

గడచిన మార్చ్ 15, 2013 నెలలో కూడా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు లీటరు పెట్రోల్‌పై రూ.2 చొప్పును తగ్గింపును (స్థానిక పన్నులు కలుపుకోకుండా) ప్రకటించిన విషయం విధితమే. కాగా తాజాగా తగ్గిన పెట్రోల్ ధర ఈరోజు అర్థరాత్రి (సోమవారం, ఏప్రిల్ 15, 2013) నుంచి అమల్లోకి వస్తుంది. వ్యాట్‌ను కలుపుకున్న తర్వాత ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.66.09 గా ఉంది (ఇది వరకు ఇది రూ.67.29 గా ఉండేది). అయితే, ప్రస్తుతానికి డీజిల్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 119.23 డాలర్ల నుంచి 116.61 డాలర్లు తగ్గిన నేపథ్యంలో ఈ తగ్గింపును అందిస్తున్న భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఓసి) పేర్కొంది. తాజా తగ్గింపు తర్వాత దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి:

* ఢిల్లీ - రూ.66.09
* ముంబై - రూ.72.88
* కలకత్తా- రూ.73.48
* చెన్నై - రూ.69.08

Petrol Price Cut

More from DriveSpark

Article Published On: Monday, April 15, 2013, 21:35 [IST]
English summary
Petrol price was on Monday cut by Re. 1 per litre, effective midnight tonight - the third reduction in rates in one month. The price cut, which was made possible because of fall in international oil prices, excludes local sales tax or VAT.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+