స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు

By Ravi

Petrol
పెట్రోల్, డీజిల్ ఇంధనాల ధరలు స్వల్పంగా పెరిగాయి. పెట్రోలుపై లీటరుకు 75 పైసలు, డీజిలుపై లీటరుకు 50 పైసల చొప్పున పెంచుతున్నట్లు (స్థానిక పన్నులు కలుపుకోకుండా) ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వెల్లడించాయి. పెరిగిన ధరలు శుక్రవారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో చమురు కంపెనీలు ఈ పెంపును ప్రకటించాయి.

తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 90 పైసలు పెరిగి రూ.63.09 నుంచి రూ.63.99కి పెరిగింది. అలాగే డీజిల్ ధర రూ.49.69 నుంచి 50.25కి పెరిగింది. డీజిల్ ధరకు, పెట్రోల్ ధరకు మధ్య వత్యాసం కేవలం 14 రూపాయలుగా మాత్రమే ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ వ్యత్యాసం మరింత చేరువయ్యే ఆస్కారం ఉంది. గడచిన జనవరి నెలలో డీజిల్ ధరలపై ప్రభుత్వం పాక్షికంగా నియంత్రణలు ఎత్తివేసిన తర్వాత ప్రతినెలా డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి.

ఇదిలా ఉండగా, వంట గ్యాస్ (ఎల్‌పిజి) ధరను ప్రతి సిలిండర్‌పై రూ.45 చొప్పున తగ్గిస్తున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. డీజిల్ ధరను వరుసగా 5వ సారి పెంచినప్పటికీ, చమురు కంపెనీలు ప్రతి లీటరు డీజిల్ విక్రయంపై రూ.4.87 చొప్పను నష్టపోతున్నట్లు ప్రకటించాయి. దీన్ని బట్టి గమనిస్తే, రానున్న డీజిల్ నెలల్లో డీజిల్ ధర దాదాపు రూ.5 వరకు పెరిగే ఆస్కారం కనిపిస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, June 3, 2013, 11:37 [IST]
English summary
Petrol price was on Friday hiked by 75 paisa per litre and diesel by 50 paisa a litre as rupee hit 11-month low making oil imports costlier. The increase in rates, which are excluding local sales tax or VAT, will be effective from Friday midnight.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+