పెట్రో మంట; లీటరుకు రూ.2కు పైగా వడ్డింపు

పన్నులు కలుపుకుంటే ఈ పెంపు రూ.2 లకు వరకు ఉంటుంది. పెరిగిన పెట్రోల్ ధర ఆదివారం ఆర్థరాత్రి నుంచే అమల్లోకి రానుంది.
అసలే పెరిగిన నిత్యావసర ధరలతో బాధపడుతున్న సమాన్యులకు తాజా పెంపు మరింత భారం కానుంది. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 1.86 పైసలు పెరిగింది. దీంతో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర 68.58గా ఉంటే, తాజా పెంపుతో ఇది రూ.70.44కు చేరింది.
డాలరుతో పోల్చుకుంటే రూపాయి విలువ క్షీణిస్తుండటమే తాజా పెంపుకు కారణం. గడచిన నెల నుంచి పెట్రోల్ ధరలు పెరగటం వరుసగా ఇది నాలుగోసారి. చమురు కంపెనీలు జూన్ 1వ తేదీన లీటరు పెట్రోల్‌పై 75 పైసలు, జూన్ 16వ తేదిన రూ.2 మరియు జూన్ 29న 1.82 చొప్పున పెంచిన సంగతి తెలిసినదే.


Click it and Unblock the Notifications








