లీటరు 2 రూపాయలకు పైగా పెరిగిన పెట్రోల్ ధర
పెట్రోల్ ధర మళ్లీ పెరిగింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఈనెలలో రెండవ సారి పెట్రోల్ ధరను పెంచేశాయి. సెప్టెంబర్ 1న లీటర్ పెట్రోల్ పై రూ.2.35 పైసలు పెంచిన చమురు కంపెనీలు తాజాగా లీటర్‌కు రూ.1.63 పైసలు పెంచుతున్నామని (స్థానిక పన్నులు కలుపుకోకుండా), పెరిగిన ధర శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది.
స్థానిక పన్నులు కలుపుకుంటే, ఈ పెంపు లీటర్ పెట్రోల్‌పై రూ.2 మేర పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి ఒడిదుడుకులు, ఇంటర్నేషనల్ మోటార్ స్పిరిట్ ధరల వ్యత్యాసం కారణంగానే పెట్రోల్ ధరను పెంచడం జరిగిందని ఐఓసీ తెలిపింది.
తాజా పెంపు తర్వాత దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి:
* ఢిల్లీ - రూ.76.06 (పెట్రోల్)
* ముంబై - రూ.83.63 (పెట్రోల్)
* కలకత్తా- రూ.83.62 (పెట్రోల్)
* చెన్నై - రూ.79.55 (పెట్రోల్)



Click it and Unblock the Notifications








