దిగిరానున్న పెట్రోల్ ధర, సిటీ బస్సులో మెయిలీ ప్రయాణం
13:45:1మోటారిస్టులు ఓ గుడ్ న్యూస్. గడచిన మే నెల నుంచి వరుసగా ఏడు సార్లు పెరిగిన పెట్రోల్ ధర, ఈ నెలాఖరు నాటికి కాస్తంత తగ్గే అవకాశం ఉందని చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. డాలరుతో పోల్చుకుంటే రూపాయి విలువ కాస్తంత మెరుగు పడటంతో లీటరు పెట్రోలుపై రూ.2-3 మేర ధరను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చమురు శాఖ పేర్కొంది. ఇదే గనుక జరిగితే, గడచిన ఐదు నెలలుగా పెట్రోల్ ధరలు పెరుగుతూ వస్తున్న పెట్రోల్ ధరలు మొదటిసారిగా తగ్గనున్నాయి.
చమురు శాఖ ప్రతి 15 రోజులకు ఒకసారి చొప్పును చముర ధరలో సవరణలు చేస్తుంది. ఇందులో భాగంగానే, అక్టోబర్ మొదటి వారంలో నిర్వహించనున్న సమావేశంలో తగ్గింపుపై ఓ నిర్ణయాన్ని వెల్లడించే ఆస్కారం ఉంది. అంతర్జాతీయ రేట్లలో తగ్గింపు లేదా రూపాయి విలువ పెరగడం కారణంగా చోటు చేసుకునే ప్రయోజనాన్ని వినియోగదారులకు బదలాయిస్తామని వీరప్ప మెయిలీ చెప్పారు. పెట్రోల్ నియంత్రిత వస్తువు కాదని, తమ వ్యయాలు, ఇతర పరామితులను దృష్టిలో ఉంచుకొని చమురు సంస్థలే పెట్రోలు ధరను నిర్ణయిస్తాయని ఆయన వివరించారు.

ఈ ఏడాది మే నెలలో పెట్రోలు ధర లీటరుకు రూ.3 మేర తగ్గింది. గత ఐదేళ్ళలో ఆ స్థాయి తగ్గింపు అదే మొదటిసారి కావటం గమనార్హం. కాగా, వచ్చే నెల 9వ తేదీ తర్వాతి నుంచి ప్రతి బుధవారం వీరప్ప మెయిలీ ఢిల్లీలోని సిటీ బస్సులలోనే ప్రయాణం చేయనున్నారు. ఇంధన ఆదాపై అవగాహన కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు. ఆయనతో పాటుగా చమురు మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు అధికారులు, ప్రభుత్వ రంగ చమురు సంస్థల్లో పని చేసే సిబ్బంది కూడా ప్రతీ బుధవారం ప్రజా రవాణా వ్యవస్థనే వినియోగిస్తారని మెయిలీ చెప్పారు.


Click it and Unblock the Notifications








