ఆపే సిటీ ఆటోరిక్షాను విడుదల చేసిన పియాజ్జియో

పియాజ్జియో ఆపే సిటీలో 3-వాల్వ్ 200సీసీ ఇంజన్‌ను ఉఫయోగించారు. భారత త్రిచక్ర వాహన విభాగంలో ఈ తరహా ఇంజన్‌ను ఉపయోగించటం ఇదే మొట్టమొదటిసారి. అయితే, ఇంజన్ పెర్ఫామెన్స్ ఫిగర్స్‌ను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. 3 ఫ్యూయెల్ ఆప్షన్లతో లభ్యమయ్యే ఆపే సిటీ ఆటోరిక్షా ధరలు ఇలా ఉన్నాయి:
- పియాజ్జియో ఆపే సిటీ (ఎల్‌పిజి) - రూ.1.10 లక్షలు
- పియాజ్జియో ఆపే సిటీ (సిఎన్‌జి) - రూ.1.23 లక్షలు
- పియాజ్జియో ఆపే సిటీ (పెట్రోల్) - రూ.1.25 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ మహారాష్ట్ర)
ఈ సెగ్మెంట్లో పోటీదారులతో పోల్చుకుంటే పియాజ్జియో ఆపే సిటీ 10 శాతం సమర్థవంతమైనదని, దీని యాక్సిలేషన్‌ను కూడా మెరుగుపరచామని కంపెనీ పేర్కొంది. ఇది 12 నెలలు లేదా 36000 కిలోమీటర్ల వారంటీతో పాటుగా 4 ఉచిత సర్వీసులతో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








