గుజరాత్ పోలీసుల కోసం పోలారిస్ ఆఫ్-రోడ్ వాహనాలు
ఆఫ్-రోడ్, ఆల్-టెర్రైన్ వాహనాల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పోలారిస్ ఇండస్ట్రీస్‌కు చెందిన భారతీయ అనుబంధ సంస్థ పోలారిస్ ఇండియా, గుజరాత్ పోలీసుల నుంచి జాక్‌పాట్ ఆర్డర్ కొట్టేసింది. పోలారిస్ ఇండియా, దేశంలోనే ఇది తొలి వాణిజ్య ఆర్డర్ కావటం విశేషం.
ఈ కంపెనీ భారత మార్కెట్లో అందిస్తున్న పోలారిస్ ఆర్‌జెడ్ఆర్ ఎస్ 800 (Polaris RZR S 800) మోడల్ కోసం గుజరాత్ పోలీసులు ఆర్డర్ చేశారు. ఈ వానాహనాలను సాధారణ రోడ్లపై కన్నా కొండలు, గుట్టలు వంటి ఆఫ్-రోడ్ ప్రయాణలకు అనుకూలంగా ఉంటాయి.
ప్రత్యేకించి ఆఫ్-రోడ్ టెర్రైన్ కోసం అభివృద్ధి చేసిన పోలారిస్ ఆర్‌జెడ్ఆర్ ఎస్ 800 వాహనంలో 760సీసీ, ట్విన్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 54 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ వాహనంలో ఇద్దరికి (డ్రైవర్ + కోప్యాసింజర్) మాత్రమే చోటు ఉంటుంది.
ఈ ఆర్డర్‌లో భాగంగా, ఆన్ అండ్ ఆఫ్ సైట్ ట్రైనింగ్, మెయింటినెన్స్ మరియు ఆఫ్టర్ సేల్స్ సపోర్టును పోలారిస్ గుజరాత్ పోలీసులకు ఆఫర్ చేయనుంది. అటవీ ప్రాంతాలు, తీర ప్రాంతాలు, నిఘా మరియు పెట్రోలింగ్ కోసం పోలీసులు ఈ వాహనాలను ఉపయోగించనున్నారు.
అయితే, గుజరాత్ పోలీసులు ఎంత సంఖ్యలో వాహనాలను ఆర్డర్ చేసిన విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

పోలారిస్ ఆర్‌జెడ్ఆర్ ఎస్ 800

పోలారిస్ ఆర్‌జెడ్ఆర్ ఎస్ 800

పోలారిస్ ఆర్‌జెడ్ఆర్ ఎస్ 800

పోలారిస్ ఆర్‌జెడ్ఆర్ ఎస్ 800



Click it and Unblock the Notifications








