బెంగుళూరులో 2 కొత్త ఆఫ్-రోడ్ సర్క్యూట్లను ప్రారంభించిన పోలారిస్
ఆఫ్-రోడింగ్ ప్రియులకు గుడ్ న్యూస్. అమెరికాకు చెందిన ప్రముఖ ఆఫ్-రోడ్ వాహనాల తయారీ సంస్థ పోలారిస్ ఇండస్ట్రీస్ బెంగుళూరులో రెండు కొత్త ఆఫ్-రోడ్ సర్క్యూట్లను ప్రారంభించిందిం. ఆఫ్-రోడింగ్ అడ్వెంచర్స్ అంటే ఇష్టపడే వారిని దృష్టిలో ఉంచుకొని బిగినర్స్ కోసం అలాగే సీజన్డ్ ఆఫ్-రోడర్ల కోసం ఈ సర్క్కూట్లను ప్రారంభించినట్లు పోలారిస్ ఇండియా పేర్కొంది. భారత్‌లో పోలారిస్ అందిస్తున్న ఏటివి (ఆల్-టెర్రైన్ వాహనాల)తో ఈ ఆఫ్-రోడ్ సర్క్యూట్లపై సరికొత్త అనుభూతని పొందవచ్చని కంపెనీ తెలిపింది.
బెంగుళూరులో మోటార్‌స్పోర్ట్ ప్రియులు ఎక్కువగా ఉన్నారని అందుకే, ప్లే (Play) సహకారంతో సర్జాపూర్‌లో ఓ కొత్త ఆప్-రోడ్ సర్క్యూట్‌ను అలాగే టార్గెట్ గేమ్స్ అండ్ ఫెసిలిటీస్ (Target Games & Facilities) సహకారంతో యశ్వంత్‌పూర్‌లో కొత్త ఆప్-రోడ్ సర్క్యూట్‌ను ప్రారంభించామని కంపెనీ పేర్కొంది. ఈ సర్జాపూర్, యశ్వంత్‌పూర్ ట్రాక్‌ల సమయాల్లో ప్లే మరియు టార్గెట్ గేమ్స్ అండ్ ఫెసిలిటీస్ కోసం పోలారిస్ అందిస్తున్న ఆఫ్-రోడ్ వాహనాలకు ధక్షిణాధి రీజియన్‌లో అధీకృత పోలారిస్ డీలర్ అయిన ఏకెబి మోటార్స్ సర్వీస్ సేవలను అందిస్తుంది.
ఈ ఆఫ్-రోడ్ సర్క్యూట్లపై మోటార్‌స్పోర్ట్ ప్రియులు పోలారిస్ అందిస్తున్న 12 రకాల వాహనాలను రైడ్/డ్రైవ్ చేయవచ్చు. వీటిల్లో అవుట్‌లా 50సీసీ, స్పోర్ట్స్‌మ్యాన్ 90సీసీ, ఆర్‌జెడ్ఆర్ 170సీసీ, ఫినిక్స్ 200సీసీ, స్పోర్ట్స్‌మ్యాన్ 400సీసీ, ఆర్‌జెడ్ఆర్ ఎస్ 800సీసీ వాహనాలను సర్జాపూర్ ఆఫ్-రోడ్ కోర్స్ ట్రాక్‌పై నడపొచ్చు. ఈ ట్రాక్ దాదాపు 30,000 చ.అ. విస్తీర్ణంలో కొండలు, ఎత్తు పల్లాలు, యాక్సిల్ బ్రేకర్స్, నీటి ముడుగులు, ఏటవాలు రోడ్లతో ఏర్పాటు చేశారు.
ఇకపోతే యశ్వంతపూర్ ఆఫ్-రోడ్ ట్రాక్ దాదాపు 20,000 చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడింది. ఈ ట్రాక్‌పై 5 పోలారిస్ ఏటివిలపై (స్పోర్ట్స్‌మ్యాన్ 90సీసీ, ఆర్‌జెడ్ఆర్ 170సీసీ, స్రాంబ్లర్ 50సీసీ, స్పోర్ట్స్‌మ్యాన్ 400సీసీ, స్పోర్ట్స్‌మ్యాన్ 500సీసీ) సవారీ చేయవచ్చు. ఈ ట్రాక్‌లపై డ్రైవ్ చేయటానికి స్వంత వాహనం అయితే రూ.150 నుంచి రూ.800 రేంజ్‌లో చెల్లించాల్సి ఉంటుంది. స్వంత వాహనం లేకపోతే మీరు ఎన్నుకునే వాహనం, ట్రాక్, సమయాన్ని బట్టి రూ.7,500 నుంచి రూ.10,000 వరకూ చెల్లించాల్సి ఉంటుంది.

బెంగుళూరులో 2 కొత్త ఆఫ్-రోడ్ సర్క్యూట్లను ప్రారంభించిన పోలారిస్

బెంగుళూరులో 2 కొత్త ఆఫ్-రోడ్ సర్క్యూట్లను ప్రారంభించిన పోలారిస్

బెంగుళూరులో 2 కొత్త ఆఫ్-రోడ్ సర్క్యూట్లను ప్రారంభించిన పోలారిస్

బెంగుళూరులో 2 కొత్త ఆఫ్-రోడ్ సర్క్యూట్లను ప్రారంభించిన పోలారిస్

బెంగుళూరులో 2 కొత్త ఆఫ్-రోడ్ సర్క్యూట్లను ప్రారంభించిన పోలారిస్

బెంగుళూరులో 2 కొత్త ఆఫ్-రోడ్ సర్క్యూట్లను ప్రారంభించిన పోలారిస్

బెంగుళూరులో 2 కొత్త ఆఫ్-రోడ్ సర్క్యూట్లను ప్రారంభించిన పోలారిస్

Click it and Unblock the Notifications