ఎయిర్‌లెస్ టైర్లతో కూడిన ఏటివి విడుదల చేసిన పోలారిస్
గాలి అవసరం లేని ఎయిర్‌లెస్ టైర్ కాన్సెప్ట్ గురించి తెలుగు డ్రైవ్‌స్పార్క్ డిసెంబర్ 2011లో ఓ కథనంలో ప్రచురించింది. ఇప్పుడు ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఏటివి (ఆల్ టెర్రైన్ వెహికల్) తయారీదారు, అమెరికాకు చెందిన పోలారిస్ తాజాగా నాన్ న్యుమాటిక్ టైర్లను ప్రయోగాత్మకంగా పరిశీలించి, ఎయిర్‌లెస్ టైర్లతో కొత్త ఏటివిని సృష్టించింది. 'టెర్రైన్ ఆర్మోర్' పేరుతో పిలిచే ఈ గాలి అవసరం లేని టైర్లను కంపెనీ అందిస్తున్న మిలటరీ గ్రేడ్ స్పోర్ట్స్‌మ్యాన్ డబ్ల్యూవి850 హెచ్.ఓ. ఏటివిలలో ఉపయోగిస్తోంది.
ఈ టైర్లతో పంక్చర్ సమస్య అస్సలే ఉండదు, ఇవి త్వరగా చిరిగిపోవు, వీటి జీవిత కాలం కూడా ఎక్కువ. అంతేకాకుండా, ఈ టైర్లతో ఎలాంటి ప్రాంతాల్లోనైనా, అసలు రోడ్లే లేని చోట కూడా ప్రయాణించటం సాధ్యమవుతుంది. పోలారిస్ స్పోర్ట్స్‌మ్యాన్ డబ్ల్యూవి850 హెచ్.ఓ. ఏటివిని వాస్తవానికి పని ప్రాంతాల్లో భారీ వస్తువులను తరలించేందు కోసం తయారు చేశారు. ఈ ఏటివిల పనితీరుకు సంబంధించి కంపెనీ ఇటీవలే ఓ రెండు వీడియోలను కూడా విడుదల చేసింది. ఆ వివరాలేంటో పరిశీలిద్దాం రండి.

సాధారణ టైర్ల మాదిరిగా నాన్-న్యుమాటిక్ టైర్లకు గాలి అవసరం లేదు. ఈ టైర్లలో ఎయిర్ కంపార్ట్‌మెంట్‌కు బదులుగా ధృడంగా అలాగే ఫ్లెక్సిబల్‌గా ఉండే ప్లాస్టిక్, రబ్బర్‌తో తయారు చేయబడిన స్పోక్స్ వంటి నిర్మాణం ఉంటుంది.

ఈ ఎయిర్‌లెస్ టైర్లు పంక్చర్లు కావు, పగిలిపోవు, అధిక వేగంతో వెళ్తున్నప్పటికీ ఇవి బరస్ట్ కాకుండా ఉండి ప్రమాదాల నుండి రక్షిస్తాయి. ఈ టైర్లు సురక్షితమైనవే కాకుండా ప్రకృతి సాన్నిహిత్యమైనవి కూడా. ఈ టైర్లను 100 శాతం రీసైకిల్ చేసుకోవచ్చు.

పోలారిస్ స్పోర్ట్స్‌మ్యాన్ డబ్ల్యూవి850 హెచ్.ఓ. ఆల్ టెర్రైన్ వాహనాన్ని పోలారిస్ ఎమ్‌వి850 మిలటరీ వాహనం ఆధారంగా చేసుకొనని తయారు చేశారు. ఇందులో సింగిల్ ట్రాన్సిమిషన్ మాత్రమే ఉంటుంది. అంటే ఒక్క గేరు మాత్రమే ఉంటుందున్నమాట. అలాగే రివర్స్ గేర్ కూడా ఉంటుంది.
పోలారిస్ తెలిపిన సమాచారం ప్రకారం ఈ టెర్రైన్ ఆర్మోర్ టైర్లకు 0.50 బుల్లెట్ తగిలినప్పటికీ ఇవి 563 కిలోమీటర్ల దూరం వరకూ అలాగే, 3 ఇంచ్ రెయిల్ రాడ్ స్పైక్ గుచ్చుకున్నప్పటికీ 1600 కిలోమీటర్ల దూరం వరకు వీటి జీవిత కాలం ఉంటుందట.
పోలారిస్ స్పోర్ట్స్‌మ్యాన్ డబ్ల్యూవి850 హెచ్.ఓ. 680 కేజీల బరువును మోయగలదు. ఈ అల్టిమేట్ ఆల్ టెర్రైన్ వెహికల్ పనితీరును ఈ వీడియోలో వీక్షించండి.


Click it and Unblock the Notifications








