వివిధ దేశాల్లో పోలీసులు ఉపయోగించే పాపులర్ కార్లు
వ్యక్తిగత రవాణాలో కీలక పాత్ర పోషించే కార్లు, దొంగలను పట్టుకోవటంలోను అంతే కీలక పాత్ర పోషిస్తాయి. మెరుగైన భద్రతా సేవలను అందించేందుకు, కేసులను త్వరగా పరిష్కరించేందుకు పోలీసులకు ప్రభుత్వం ద్వారా అధికారిక వాహనాలను జారీ చేయబడుతాయి. ఈ పోలీసుల వాహనాల విషయానికి వస్తే, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్రముఖ కారును వారికి కేటాయించడం జరుగుతుంది.
అధికార హోదాను బట్టి వాహనాలు కూడా మారే అవకాశం ఉంది. అయితే, సాధారణ ప్రయోజనాల కోసం వినియోగించే కార్లు మాత్రం అత్యంత పాపులర్ అయి ఉంటాయి. అలాంటి వాటిలో, ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల పోలీసులు ఉపయోగించే కొన్ని ప్రముఖ పోలీస్ కార్లను ఈ కథనంలో తెలుసుకుందా రండి..!

జర్మనీ - బార్బస్ సిఎల్ఎస్ రాకెట్
కార్ల కంపెనీలకు పుట్టినిల్లు అయిన జర్మనీలో అక్కడి పోలీసులు ఉపయోగించే కారు పేరు 'బార్బస్ సిఎల్ఎస్ రాకెట్'. పేరుకు తగ్గట్లుగానే ఇది రాకెట్ వేగంతో పరుగులు తీస్తూ, పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు వారికి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న సిఎల్ఎస్ కారుకు పెర్ఫామెన్స్ ఎడిషనే ఈ బార్బస్ సిఎల్ఎస్ రాకెట్.

మిచిగాన్ (అమెరికా) - కాడిలాక్ సిటిఎస్-వి
అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ అందిస్తున్న కార్ బ్రాండ్ కాడిలాక్ (ఆ దేశ అధ్యక్షుడి అధికారిక వాహనం కూడా ఇదే బ్రాండ్). మిచిగాన్ పోలీసులు పెట్రోలింగ్ కోసం కాడిలాక్ సిటిఎస్-వి కారును ఉపయోగిస్తారు. చూడటానికి ఇది ఎంతో అందంగా ఉంది కదూ..!

టెక్సాస్ (అమెరికా) - చెవర్లే కమారో
చెవర్లే కూడా అమెరికన్ ఆటోమొబైల్ బ్రాండ్ జనరల్ మోటార్స్‌కు చెందనదే. టెక్సాస్ పోలీసులు ఈ ఖరీదైన మరియు శక్తివంతమైన కారును తమ అధికారిక వాహనంగా వినియోగిస్తారు.

ఫ్లోరిడా (అమెరికా) - డాడ్జ్ ఛాలెంజర్
డాడ్జ్ ఛాలెంజర్ క్లాసిక్ కార్ అయినప్పటికీ, ఇది ఇంకా పోలీసులకు సేవలందిస్తూనే ఉంది. ఫ్లోరిడా పోలీసులు డాడ్జ్ ఛాలెంజర్ కారును తమ పెట్రోలింగ్ ప్రయోజనం కోసం ఉపయోగిస్తారు.

జపాన్ - హోండా ఎన్ఎక్స్
మరి జపాన్ పోలీసులు ఏ కారును ఉపయోగిస్తారో తెలుసా..? హోండా అందిస్తున్న పాపులర్ ఎన్ఎస్ఎక్స్ కారుని. వేగాని, వేగవంతమైన రోడ్లకు నిలయమైన జపాన్‌లో క్రిమినల్స్‌ను క్యాచ్ చేయాలంటే వారికి హోండా ఎన్ఎస్ఎక్స్ కారు కావాల్సిందే.

అబుదాబి - నిస్సాన్ జిటిఆర్
ఆయిల్ రిచ్ దేశమైన అబుదాబి పోలీసులు ఉపయోగించే నిస్సాన్ జిటిఆర్ స్పోర్ట్స్ కారు. వేగానికి, పికప్‌కు, పెర్ఫామెన్స్‌కు మారు పేరు నిస్సాన్ జిటిఆర్. అందుకే సచిన్ కూడా తన ఫెరారీ కారును అమ్మేసి ఓ నిస్సాన్ జిటిఆర్ కారును కొనుగోలు చేసాడు.

ఫ్రాన్స్ - ప్యూజో స్పోర్ట్స్ జిటి
ఫ్రెంచ్ పోలీసులు ఉపయోగించే ఈ అందమైన కారు పేరు ప్యూజో స్పోర్ట్స్ జిటి. హైవే పెట్రోలింగ్ కోసం ఫ్రాన్స్ పోలీసులు ఈ కారును తమ అధికారిక వాహనంగా ఉపయోగిస్తారు.

జర్మనీ - పోర్షే 911
జర్మనీలో పోలీసు ఉన్నతాధికారుల కోసం ఆ దేశ ప్రభుత్వం పాపులర్ పోర్షే 911 కారును అధికారిక వాహనంగా కేటాయించింది. ప్రపంచ వ్యాప్తంగా పోర్షే 911 పెద్ద క్రేజ్ ఉంది. పవర్‌ఫుల్ ఇంజన్, సాటిలేని పెర్ఫామెన్స్, గరిష్ట వేగాలకు పోర్షే 911 పెట్టింది పేరు.

నెథర్లాండ్స్ - స్పైకర్ సి8
నెథర్లాండ్స్ పోలీసులు స్పైకర్ సి8 అనే కన్వర్టిబల్ స్పోర్ట్స్ కారును తమ అధికారిక వాహనంగా ఉపయోగిస్తారు. పెట్రోలింగ్ సమయాల్లో దొంగలను సులువుగా క్యాచ్ చేసేందుకు ఈ కన్వర్టిబల్ కారు ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది.

భారతదేశం - మహీంద్రా జీప్
ఇక చివరిగా మన దేశ పోలీసులకు ప్రభుత్వం అధికారిక వాహనంగా కేటాయించింది మహీంద్రా జీప్ (అధికారి హోదాను బట్టి వాహనం మారుతుంది). ఎన్నో సంవత్సరాలుగా భారతీయుల రవాణా అవసరాలను తీరుస్తున్న జీప్ ఇప్పటికీ పోలీసులకు అధికారిక వాహనంగా ఉండటం చెప్పుకోదగిన విషయం.


Click it and Unblock the Notifications








