మారుతి సుజుకి కార్మికుల కుటుంబాలపై లాఠీఛార్జ్!

Manesar
గడచిన సంవత్సరం జులై నెలలో మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులో జరిగిన అల్లర్లలో అరెస్టయిన 147 మంది కార్మికులను గుర్గావ్ జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న మారుతి సుజుకి కార్మికుల కుటుంబాలపై పోలీసులు లాఠీ జులిపించారు. హర్యానా పారిశ్రామిక మంత్రి రన్‌దీప్ సింగ్ సుర్జెవాలా స్వంత జిల్లా అయిన ఖైతాల్‌లో మారుతి సుజుకి కార్మికుల కుటుంబాలు గడచిన ఏప్రిల్ 28 నుంచి నిరస చేస్తున్నారు.

ఈ కేసులో అరెస్టయి గుర్గావ్ జైలులో ఉన్న 147 మంది శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులను తక్షణమే విడుదల చేసి, వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కార్మికుల కుటుంబీకులు ఏప్రిల్ 28 నుంచి ఖైతాల్‌లోని మినీ సెక్రటేరియేట్ వద్ద శాంతియుత ధర్నా నిర్వహిస్తున్నారు. అయితే, గడచిన ఆదివారం వారిని పోలీసులు ఖాలీ చేయించాలని ప్రయత్నించండో ఆందోళనకారులు తిరగబడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జ్‌కపు ఉపక్రమించారు.

గడచిన సంవత్సరం జులై 18న జరిగిన మానేసర్ అల్లర్లలో మారుతి సుజుకి హెచ్ఆర్ మేనేజర్ సజీవంగా అగ్నికి ఆహుతి కాగా, మరో 96 మంది గాయపడిన సంగతి తెలిసినదే. ఈ ఘటనకు పాల్పడిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

More from DriveSpark

Article Published On: Monday, May 20, 2013, 11:29 [IST]
English summary
Families of Maruti Suzuki workers protesting in Kaithal, the home district of Haryana industries minister Randeep Singh Surjewala, were lathicharged by the police on Sunday.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+