పిల్లల కోసం పోర్షే గో-కార్ట్ పెడల్ కార్

By Ravi

జర్మన్ కార్ కంపెనీ పోర్షే చిన్న పిల్లల కోసం ఓ ప్రత్యేక కారును తయారు చేసింది. సైకిల్ మాదిరిగా పెడల్స్ సాయంతో తొక్కే సౌకర్యం కలిగిన ఈ గో-కార్ట్ పెడల్ కార్ ధర 900 అమెరికన్ డాలర్లు. అంటే మనదేశ కరెన్సీలో సుమారు రూ.52,000 లకు పైమాటే.

అల్లాయ్ వీల్స్‌కు జోడించిన సన్నటి న్యుమాటిక్ ఎయిర్ ఫిల్డ్ టైర్స్, సౌకర్యవంతమైన సీట్, సేఫ్టీ కోసం కోస్టర్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు రివర్స్ పెడలింగ్ వంటి ఫీచర్లు ఈ గో-కార్ట్ పెడల్ కార్ సొంతం. దీని నిర్మాణంలో మెటల్, ప్లాస్టిక్ పదార్థాలను మరియు సైకిల్ విడిభాగాలను ఉపయోగించారు. పోర్షే ఇంటెలిజెన్స్ పెర్ఫామెన్స్ డిజైన్ ఫిలాసఫీని దృష్టిలో ఉంచుకొని ఈ కిడ్స్ కారును తయారు చేశారు.

పోర్షే ఇదే డిజైన్ ఫిలాసఫీని తమ లగ్జరీ మరియు స్పోర్ట్స్ కార్ల తయారీలో ఉపయోగిస్తుంటుంది. అందువల్లనే ఈ గో-కార్ట్ కారు తేలిక బరువును కలిగి ఉంటుంది. దీని మొత్తం బరువు 25 కిలోలు మాత్రమే. అయినప్పటికీ అత్యంత ధృఢత్వాన్ని కలిగి ఉంటుంది. 5 నుంచి 8 ఏళ్ల వయస్సు పిల్లలను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ కారును అభివృద్ధి చేసింది. మీ పిల్లల్ని కూడా మరో సెబాస్టియన్ వెట్టల్‌లా మార్చాలంటే వారికి ఇప్పటి నుంచే ఇలాంటి కార్లపై శిక్షణ ఇవ్వటం ఎంతో అవసరం.

Porsche Go Kart Pedal Car

More from DriveSpark

Article Published On: Wednesday, June 19, 2013, 11:14 [IST]
English summary
go-kart has been constructed with "Porsche Intelligence Performance," design philosophy in mind - the same one which is employed while constructing its luxury and sports cars.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+