భారత మార్కెట్లో పనామెరా ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసిన పోర్షే

By Ravi

ఫోక్స్‌వ్యాగన్ గ్రూపుకు చెందిన జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ పోర్షే ఇండియా, భారత మార్కెట్లో మరొక సరికొత్త కారును విడుదల చేసింది. పోర్షే అందిస్తున్న పనామెరాలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కంపెనీ దేశీయ విపణిలో విడుదల చేసింది. భారత మార్కెట్లో పోర్షే పనామెరా ధరలు రూ.1.19 కోట్ల నుంచి రూ.1.99 కోట్ల రేంజ్‌‌లో ఉన్నాయి.

ఈ మోడల్‌ను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని పోర్షే ఇక్కడి మార్కెట్లో విక్రయించనుంది. పోర్షే పనామెరా మొత్త ఐదు వేరియంట్లలో లభిస్తుంది. వాటి ధరల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

  • పోర్షే పనామెరా - రూ.1.19 కోట్లు
  • పోర్షే పనామెరా 4 - రూ.1.22 కోట్లు
  • పోర్షే పనామెరా డీజిల్ - రూ.1.23 కోట్లు
  • పోర్షే పనామెరా జిటిఎస్ - రూ.1.60 కోట్లు
  • పోర్షే పనామెరా టర్బో - రూ.1.99 కోట్లు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

Porsche Launches Panamera Facelift

కొత్త పోర్షే పనామెరా కారులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, పోర్షే కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్ ప్లస్ నావిగేషన్, బోస్ సౌండ్ సిస్టమ్, పార్క్ అసిస్ట్ (రివర్స్ కెమెరాతో పాటుగా), ఎయిర్ సస్పెన్షన్, పోర్షే యాక్టివ్ సస్పెన్షన్ మేనేజ్‌మెంట్ (పిఏఎస్ఎమ్) (ఎంట్రీ లెవల్ వి6 పెట్రోల్ వేరియంట్లో మినహా అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది) వంటి ఫీచర్లు స్టాండర్డ్ ఎక్విప్‌మెంట్‌గా లభ్యం కానున్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, October 9, 2013, 12:56 [IST]
English summary
The Porsche Panamera, the brand’s four-seater sports car for every day which gave the automotive executive class a new lease of life, is expanding further by introducing the second generation in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+