'క్వాడ్రిసైకిల్'ను కొత్త వాహన విభాగం గుర్తించిన సర్కార్
'క్వాడ్రిసైకిల్' (నాలుగు చక్రాలు కలిగిన వాహనం) గుర్తింపు విషయంలో గతకొద్ది కాలంగా ఉన్న సమస్య ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. 'క్వాడ్రిసైకిల్'ను ఓ కొత్త వాహన విభాగంగా గుర్తిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. అనేక సమీక్షలు, నిపుణలు మరియు ప్రజల సలహాల మేరకు భారత ప్రభుత్వం 'క్వాడ్రిసైకిల్' (Quadricycle) అనే కొత్త వాహన విభాగానికి గ్రీన్ సిగ్నల్ తెలిపింది.
రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ క్వాడ్రిసైకిల్ విభాగాన్ని సోమవారం ఆమోదించింది. అయితే, క్వాడ్రిసైకిల్ వాహనాలను కేవలం నగర పరిధిలో (సిటీ లిమిట్స్)నే వినియోగించేందుకు అనుమతినిచ్చారు. అంతేకాకుండా, వీటిని ప్రజా రవాణా మరియు వాణిజ్య రవాణా (పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మరియు కమర్షియల్ ట్రాన్స్‌పోర్ట్) వాహనాలుగా మాత్రమే ఉపయోగించాలనే నిబంధన విధించారు.

కానీ వీటిని రెగ్యులర్ కార్ల మాదిరిగా వ్యక్తిగత రవాణా (పర్సనల్ ట్రాన్స్‌పోర్ట్) కోసం ఉపయోగించడానికి అనుమతి లేదు. అన్ని ఇతర వాహనాల మాదిరిగానే వీటిలో ఎలక్ట్రిక్ వెర్షన్లను తయారు చేసేందుకు కూడా తయారీదారులకు అనుతినిచ్చారు. ప్రస్తుతం నగర రోడ్లపై తిరుగుతున్న సాంప్రదాయ త్రిచక్ర వాహనాలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయంగా ఈ కాడ్రిసైకిల్‌ను పరిగణించడం జరుగుతుంది.
కాడ్రిసైకిల్స్ విషయంలో క్రాష్ టెస్ట్ సౌకర్యం లేదు కాబట్టి, ఇవి తప్పనిసరిగా డ్యూయెల్ కార్-టైప్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉండాలి. అంతేకాకుండా, వీటిలో 450 కిలోలకు మంచి ఎక్కువ బరువు కలిగి ఉండేలా ప్రయాణికులను తరలించకూడదు. ఇవి 3 మీటర్ల కంటే ఎక్కువ పొడవును కలిగి ఉండకూడదు. కమర్షియల్ వేరియంట్స్ విషయంలో పేలోడ్ 550 కేజీలు ఉండాలి, వీటి పొడవు 3.7 మీటర్ల వరకు ఉండొచ్చు. ప్యాసింజర్ వెర్షన్ క్వాడ్రిసైకిళ్లలో నలుగురు వ్యక్తులకు మించి ప్రయాణించకూడదు (డ్రైవర్‌తో కలిపి).
బ్యాటరీతో నడిచే క్వాడ్రిసైకిళ్ల విషయంలో మొత్తం బరువు లోనుంచి బ్యాటరీ బరువును మినహాయించారు. రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం, మరో నెల వ్యవధిలో తుది నోటిఫికేషన్‌ను విడుదల చేయటం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ జారీ అయిన ఆరు నెల తర్వాతి నుంచి క్వాడ్రిసైకిల్స్ భారత రోడ్లపై తిరిగేందుకు అనుమతి లభిస్తుంది. అంటే, వచ్చే ఏడాది మధ్య భాగం నుంచి బజాజ్ ఆర్ఈ60 వంటి క్వాడ్రిసైకిల్స్‌ను రోడ్లపై మనం చూడబోతున్నాం అన్నమాట.


Click it and Unblock the Notifications








