డస్టర్ ఎఫెక్ట్: ఐదు రెట్లు పెరిగిన రెనో ఇండియా కార్ సేల్స్

Renault Duster
భారత మార్కెట్లో డస్టర్ ఎస్‌యూవీ విడుదల చేయటంతో రెనో ఇండియా ఫేట్ మారిపోయింది. కాస్తంత ఆలస్యంగా విడుదలైనప్పటికీ, రెనో డస్టర్ దేశీయ విపణిలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతుండటంతో గత జనవరి నెలలో కంపెనీ అమ్మకాలు భారీగా పుంజుకున్నాయి. జనవరి 2013లో రెనో ఇండియా అమ్మకాలు ఏకంగా ఐదు రెట్లు పెరిగి 4,914 యూనిట్లుగా నమోదయ్యాయి.

గడచిన సంవత్సరం ఇదే సమయంలో తమ మొత్తం అమ్మకాలు కేవలం 885 యూనిట్లుగా మాత్రమే ఉన్నట్లు రెనో ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. జనవరి 2013లో రెనో ఇండియా విక్రయించిన మొత్తం వాహనాల్లో 3,554 యూనిట్లు రెనో డస్టర్ ఎస్‌‌యూవీలే ఉండటం విశేషం. కంపెనీ ఇదే సయంలో 812 స్కాలా సెడాన్‌లను, 403 పల్స్ హెచ్‌బ్యాక్‌లను, 108 ఫ్లూయెన్స్ ప్రీమియం సెడాన్‌లను, 37 కొలియోస్ ఎస్‌యూవీలను విక్రయించినట్లు పేర్కొంది.

ఈ సందర్భంగా రెనో ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) సుమిత్ సాహ్నేయ్ మాట్లాడుతూ.. 2012 సంవత్సరంలో భారత్‌లో 35,000 లకు పైగా వాహనాలను విక్రయించి మంచి వృద్ధి నమోదు చేసుకున్నామని, ఇదే సమయంలో డస్టర్ ఎగుమతులను కూడా ప్రారంభించామని, జనవరిలో నమోదైన అమ్మకాలను చూస్తుంటే, ఇకపై భవిష్యత్తులో కూడా ఇదే విధమైన వృద్ధిని కొనసాగించగలమన్న ధీమా కలుగుతోందని అన్నారు.

More from DriveSpark

Article Published On: Friday, February 1, 2013, 14:21 [IST]
English summary
French carmaker Renault India has reported over five-fold jump in sales in January this year at 4,914 units. The company had sold a total of 885 vehicles during January 2012.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+