వార్షికోత్స ఎడిషన్ డస్టర్ ఎస్‌యూవీని విడుదల చేసిన రెనో
ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనో ఇండియా తమ పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ రెనో డస్టర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసి అప్పుడు ఏడాది పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కంపెనీ ఇందులో ఓ వార్షికోత్సవ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. త్వరలోనే ఈ వార్షికోత్సవ ఎడిషన్ రెనో డస్టర్ అన్ని అధీకృత డీలర్‌షిప్ కేంద్రాల్లో అందుబాటులోకి రానుంది.
రెనో డస్టర్ యానివర్స్‌రే ఎడిషన్ 'బ్లూ కాస్మోస్' అనే ప్రత్యేకమైన రంగులో, స్పెషల్ బాడీ గ్రాఫిక్స్‌తో లభిస్తుంది. రెనో ఇండియా ఈ వార్షికోత్సవ ఎడిషన్‌ను 'ఎక్స్‌పెక్ట్ మోర్, గెట్ మోర్' అనే ప్రత్యేక స్కీమ్ క్రింద విడుదల చేసింది. ఈ స్కీమ్‌లో భాగంగా, కస్టమర్లకు డస్టర్‌పై రూ.60,000 వరకు నగదు ప్రయోజనాలను, 2 ఏళ్ల అదనపు వారంటీని మరియు 4 ఏళ్ల ఉచిత రోడ్ సైడ్ అసిస్టెన్స్‌ను ఆఫర్ చేస్తుంది.

అంతేకాకుండా, గ్యాంగ్ ఆఫ్ డస్టర్ కమ్యూనిటీలో ఉచిత మెంబర్‌షిప్‌ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తుంది. వార్షికోత్సవ ఎడిషన్ రెనో డస్టర్‌లో కొత్త కలర్ ఆప్షన్, బాడీ గ్రాఫిక్స్ మినహా వేరే ఇతర మార్పులు ఏవీ లేనట్లు తెలుస్తోంది. ఇందులో యాంత్రికపరంగా కూడా ఎలాంటి మార్పులు లేవు. రెనో డస్టర్ యానివర్స్‌రే ఎడిషన్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








