రెనో ఇండియాకు అండగా నిలుస్తున్న డస్టర్ ఎస్‌యూవీ
ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా అందిస్తున్న లేటెస్ట్ ఎస్‌యూవీ డస్టర్ దేశీయ విపణిలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. సరసమైన ధర, సరికొత్త స్పోర్టీ లుక్‌తో ఇది కొనుగోలుదారులను మొదటి చూపులోనే ఆకట్టుకుంటుంది. గడచిన జనవరి రెనో ఇండియా మొత్తం అమ్మకాలలో 82 శాతం అమ్మకాలు డస్టర్ నుంచి వచ్చాయంటేనే ఈ మోడల్ సంపాధించుకున్న పాపులారిటీ ఏంటో ఇట్టే అర్థమైపోతుంది.
మే 2013 నెలలో రెనో ఇండియా మొత్తం 6,300 కార్లను విక్రయించగా, అందులో 5,146 యూనిట్ల డస్టర్ ఎస్‌యూవీలే ఉండటం విశేషం. రెనో డస్టర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ భారత్‌లో విడుదలైన అనతి కాలంలోనే అశేష ప్రజాదరణను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా, రెనో ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమిత్ సాహ్నే వ్యాఖ్యానిస్తూ, సవాళ్లతో కూడిన ప్రతికూల మార్కెట్ పరిస్థితుల్లో రెనో పటిష్టమైన వృద్ధిని కనబరిచిందని, 2013లో గడచిన సంవత్సరం కన్నా రెట్టింపు అమ్మకాలను నమోదు చేస్తామని అన్నారు.
పటిష్టమైన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో మరియు విస్తృతమైన తమ డీలర్ నెట్‌వర్క్ ద్వారా ఈ వృద్ధిని సాధించగలిగామని, భారత్‌లో రెనో బ్రాండ్‌ను అంగీకరిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం భారత్‌లో అత్యంత పాపులర్ అయిన ఎస్‌యూవీ సెగ్మెంట్లో రెనో డస్టర్ అగ్రస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో కూడా ప్రోత్సాహకరమైన వృద్ధిని కనబరచగలని సుమిత్ ధీమా వ్యక్తం చేశారు. గడచిన నెలలో రెనో 670 స్కాలా సెడాన్లను, 410 పల్స్ హ్యాచ్‌బ్యాక్‌లను, 71 ఫ్లూయెన్స్ ప్రీమియం సెడాన్లను మరియు 3 కొలియోస్ ప్రీమియం ఎస్‌యూవీలను విక్రయించింది.



Click it and Unblock the Notifications








