మార్చ్ 2013లో 6,313 డస్టర్ కార్లను విక్రయించిన రెనో

By Ravi

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా భారత మార్కెట్లో అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ 'రెనో డస్టర్' (Renault Duster) హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. స్టయిలిష్ లుక్, ప్రీమియం ఫీచర్స్, సరమైన ధర, కాంపాక్ట్ డిజైన్ మొదలైన విశిష్టమైన ఫీచర్లతో ఇది కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది. గడచిన సంవత్సరం జులై నెలలో దేశీయ విపణిలో విడుదలైన ఈ ఎస్‌యూవీ ఇప్పటికే 30,000 వినియోగదారులను తన ఖాతాలో వేసుకుంది. రెనో ఇండియా మొత్తం అమ్మకాల్లో 75 శాతం వాటా రెనో డస్టర్‌దే కావటం విశేషం.

గడచిన మార్చ్ 2013లో రెనో ఇండియా భారత మార్కెట్లో మొత్తం 8,232 యూనిట్లను విక్రయించింది. ఇందులో 6,313 యూనిట్ల డస్టర్ ఎస్‌యూవీలే ఉన్నాయి. ఇదే సమయంలో 1,026 యూనిట్ల స్కాల్ సెడాన్స్, 541 యూనిట్ల పల్స్ హ్యాచ్‌బ్యాక్స్, 337 యూనిట్ల ఫ్లూయెన్స్ ప్రీమియం సెడాన్స్, 15 యూనిట్ల కొలియోస్ ఎస్‌యూవీలను కంపెనీ విక్రయించింది. గడచిన సంవత్సరంతో పోల్చుకుంటే రెనో ఇండియా మొత్తం అమ్మకాలు ఏకంగా 8 రెట్లు పెరిగాయి. మార్చ్ 2012 కంపెనీ మొత్తం అమ్మకాలు 1,005 యూనిట్లుగా ఉన్నాయి.

ఇక రెనో డస్టర్ విషయానికి వస్తే ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్‌లో 102 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 1.6లీటర్ ఇంజన్‌, డీజిల్ వేరియంట్‌లో 85పిఎస్, 110పిఎస్‌ల పవర్‌తో 1.5లీటర్ డిసిఐ ఇంజన్‌ను ఉపయోగించారు. పెట్రోల్ వేరియంట్ లీటరుకు 13.24 కి.మీ. మైలేజీని, డీజిల్ వేరియంట్స్ లీటరుకు (85 పిఎస్ వెర్షన్) 20.45 కి.మీ. మైలేజీని, (110 పిఎస్ డీజిల్) 19.01 కి.మీ. మైలేజీనిస్తాయి.

More from DriveSpark

Article Published On: Monday, April 1, 2013, 19:13 [IST]
English summary
French carmaker Renault India has sold 8,232 vehicles in March 2013, an eight-fold rise from 1,005 units the auto manufacturer sold during the same month of last year. The sales from across its product line up such as Renault Duster, Fluence and Scala, the company said in a statement.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+