రెనో పల్స్ 'వాయేజ్ ఎడిషన్' విడుదల
ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న పల్స్ హ్యాచ్‌బ్యాక్‌లో ఓ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. 'రెనో పల్స్ వాయేజ్ ఎడిషన్' (Renault Pulse Voyage Edition) పేరిట లభ్యం కానున్న ఈ ప్రత్యేక పల్స్ కారులో ఎలాంటి విజువల్ లేదా మెకానికల్ మార్పులు లేవు. అంటే, డిజైన్ పరంగా కానీ లేదా యాంత్రిక పరంగా కానీ ఇందులో ఎలాంటి మార్పులు లేవన్నమాట.
కానీ ఈ స్పెషల్ ఎడిషన్ రెనో పల్స్ హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ కొన్ని ప్రత్యేక ఫీచర్లను ఆఫర్ చేస్తుంది. ఇందులో నావిగేషన్‌తో కూడిన టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫోకల్ స్పీకర్లు లభిస్తాయి. ఈ పల్స్ వాయేజ్ ప్యాక్ విలువ రూ.58,000.

రెనో ఇండియా తమ కార్లపై 4 ఏళ్ల ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్, 2 ఏళ్ల ఉచిత అదనపు వారంటీ, రూ.35,000 విలువైన 2 ఏళ్ల ఉచిత బీమా వంటి ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తుంది. అయితే, ఆఫర్లు వాయేజ్ ఎడిషన్‌లో భాగం కాదు.
నిస్సాన్ మైక్రాకు రీబ్యాడ్జ్ వెర్షన్ అయిన రెనో పల్స్ హ్యాచ్‌బ్యాక్ కారు పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లో 1.2 లీటర్ 3-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 76 పిఎస్‌ల శక్తిని, 104 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వెర్షన్‌లో 1.5 లీటర్ 4-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 64 పిఎస్‌ల శక్తిని, 160 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెనో పల్స్ వాయేజ్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications








