జూన్‌లో 8 రెట్లు పెరిగిన రెనో ఇండియా అమ్మకాలు

గడచిన సంవత్సరంలో ఇదే నెల అమ్మకాలతో పోల్చుకుంటే, ఇవి ఎనిమిది రెట్లు అధికం. జూన్ 2012లో రెనో ఇండియా విక్రయించిన మొత్తం వాహనాలు 787 యూనిట్లు మాత్రమే. సవాళ్లతో కూడిన మార్కెట్ పరిస్థితుల్లోను రెనో బ్రాండ్ వృద్ధిని సాధిస్తోందని, భారతీయ వినియోగదారులు తమ బ్రాండ్‌ను చక్కగా ఆదరిస్తున్నారని రెనో ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) సుమిత్ దూబే తెలిపారు.
కాగా.. జూన్ 2013లో రెనో ఇండియా మొత్తం 6007 వాహనాలను విక్రయిస్తే, అందులో 4523 యూనిట్ల డస్టర్ అమ్మకాలే ఉండటం విశేషం. ఇందులో 772 స్కాలా సెడాన్లు, 497 పల్స్ హ్యాచ్‌బ్యాక్‌లు, 215 ఫ్లూయెన్స్ ప్రీమయం సెడాన్లు ఉన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.


Click it and Unblock the Notifications








