చవక డీజిల్ వేరియంట్ స్కాలాను విడుదల చేసిన రెనో
ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా, దేశీయ విపణిలో అందిస్తున్న స్కాలా సెడాన్‌లో ఓ ఎంట్రీ లెవల్ డీజిల్ వేరియంట్‌ను కంపెనీ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ 'రెనో స్కాలా ఆర్ఎక్స్ఈ' (Renault Scala RxE)గా పిలిచే ఈ వేరియంట్ ధర రూ.8.29 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ వేరియంట్లో డ్రైవర్-సైడ్ ఎయిర్‌బ్యాగ్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబిఎస్ (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫీచర్లున్నాయని కంపెనీ పేర్కొంది.
ఈ కొత్త స్కాలా ఆర్ఎక్స్ఈ వేరియంట్ రెనో డీజిల్ పోర్ట్‌ఫోలియో విస్తరింపజేస్తుందని, సరసమైన ధరకే వెల్ ప్యాకేజ్డ్ డీజిల్ ఆప్షన్‌ను కస్టమర్లకు ఆఫర్ చేస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. తాజా డీజిల్ వేరియంట్ చేరికతో స్కాలా మొత్తం వేరియంట్ల సంఖ్యకు ఆరుకు (3 పెట్రోల్, 3 డీజిల్) పెరిగింది. పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.7.19 లక్షల నుంచి రూ.9.99 లక్షల రేంజ్‌లో ఉండగా, డీజిల్ వేరియంట్ల ధరలు 8.29 లక్షల నుంచి రూ.9.68 లక్షల రేంజ్‌లో ఉన్నాయి. (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
అయితే, ఈ బేస్ డీజిల్ వేరియంట్ రెనో స్కాలాలో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులో అదే 1.5 లీటర్ కె9కె డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 85 పిఎస్‌ల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. రెనో ఇండియా అందిస్తున్న మిడిల్ వేరియంట్ స్కాలా ఆర్ఎక్స్ఎల్ ధర కన్నా ఈ బేస్ వేరియంట్ స్కాలా ఆర్ఎక్స్ఈ ధర దాదాపు రూ.50,000 తక్కువగా ఉంది.



Click it and Unblock the Notifications








