కొత్త కారు ఇవ్వండి లేదా రూ.8 లక్షలు చెల్లించండి..

అంతేకాకుండా, ఆ కారులోని సమస్యలను సరిచేసేందుకు 20 సార్లకు పైగా వర్క్‌షాపుకు తిరిగినందుకు గాను సదరు అడ్వకేట్‌కు 3.67 లక్షల పరిహారాన్ని చెల్లించాలని ఫోరమ్ పేర్కొంది. ఈ కేసులోని రికార్డును డీలర్ సుమారు 20 సార్లకు పైగా ఈ కారును రిపేరు చేసినట్లు తెలుస్తోంది. అన్నిసార్లు మరమ్మత్తు చేసినప్పటికీ, సదరు కారు సరిగ్గా పనిచేయకపోగా, పూర్తిగా చెడిపోయింది. తయారీ లోపాలు ఉండటం వల్లనే ఈ కారు అనేక సార్లు మరమ్మత్తుకు వచ్చి, చివరికి పూర్తిగా నిలిచిపోయిందని ఫోరమ్ అధ్యక్షుడు నరేంద్ర కుమార్ తెలిపారు.
ఢిల్లీకి చెందిన అడ్వకేట్ లలిత్ భాసిన్ 2000 సంవత్సరంలో ఓ జనరల్ మోటార్స్ అధీకృత డీలర్‌షిప్ నుంచి కొత్త ఓపెల్ ఆస్ట్రా క్లబ్ కారును కొనుగోలు చేశారు. ఈ కారను కొనుగోలు చేసిన నెలలోనే సమస్యలు తలెత్తడం ఆ తర్వాత వరుసగా 2008 వరకూ అనేక సార్లు మరమ్మత్తులకు గురవటంతో భాసిన్ జనరల్ మోటార్స్‌పై కన్జ్యూమర్ ఫోరమ్‌లో కేసు వేశారు. రిపేరుకు తీసుకువెళ్లిన ప్రతిసారి మరమ్మత్తుల కోసం సదరు డీలర్ డబ్బులు వసూలు చేసేవాడని భాసిన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ విషయంపై జనరల్ మోటార్స్‌ను సంప్రదించగా, ఆ కారులో ఎలాంటి తయారీ లోపాలు లేవని కొట్టిపారేసింది. అయితే, ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించిన ఫోరమ్, కేవలం తయారీ లోపాల కారణంగా కారులో ఇలాంటి తీవ్రమైన సమస్యలు తలెత్తాయని, ఇందుకు తయారీదారే బాద్యత వహించాలని, ఇందులో భాగంగా భాసియాకు ఓ కొత్త కారును కాను లేదా రూ.8 లక్షల మొత్తాన్ని కానీ చెల్లించాలని తీర్పునిచ్చింది.


Click it and Unblock the Notifications








