జెనీవా మోటార్ షోకు పయనమైన రిన్‌స్పీడ్ మైక్రోమ్యాక్స్ ఈవి
స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ రిన్‌స్పీడ్ నిల్చుని ప్రయాణించే ఓ వినూత్నమైన కాన్సెప్ట్ కారు 'మైక్రోమ్యాక్స్ ఈవి' (MicroMAX EV)ను అభివృద్ధి చేస్తున్న విషయం గురించి గడచిన సంవత్సరంలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం ఈ కంపెనీ తమ మైక్రోమ్యాక్స్ ఈవి కాన్సెప్ట్ కారును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది. అంతేకాదు, ఈ ఏడాది జెనీవాలో జరగనున్న అంతర్జాతీయ ఆటో షోలో తమ కాన్సెప్ట్‌ను రిన్‌స్పీడ్ ప్రదర్శనకు ఉంచనుంది.
ఈ నేపథ్యంలో, రిన్‌స్పీడ్ తమ మైక్రోమ్యాక్స్ ఈవి కాన్సెప్ట్ కారు ఫోటోలను విడుదల చేసింది. సాధారణ కార్లలో కూర్చుని ప్రయాణిస్తాం కానీ మైక్రోమ్యాక్స్ ఈవి కాన్సెప్ట్ కారులో మాత్రం నిల్చుని ప్రయాణిస్తాం. అదే ఈ కాన్సెప్ట్ ప్రత్యేకత. రిన్‌స్పీమ్ మైక్రోమ్యాక్స్ ఈవి కాన్సెప్ట్ 3.6 మీటర్ల పొడవును, 2.2 మీటర్ల ఎత్తును కలిగి ఉంటుంది. ఇందులో ఒక డ్రైవర్, ముగ్గురు ప్యాసింజర్లకు చోటు ఉంటుంది. అంతేకాకుండా, ఇందులో ఒక స్ట్రోలర్ లేదా షాపింగ్ కార్ట్‌ను స్టోర్ చేసుకోవచ్చు.
ఈ కారును నిల్చుని ప్రయాణించేటప్పుడు కాళ్లపై పూర్తి భారం పడకుండా ఉండేలా ఇందులో బ్యాక్‌రెస్ట్ సీట్లను (అప్‌రైట్ సీట్స్) అమర్చారు. ఇందులో నాలుగు సీట్లకు సీట్‌బెల్ట్స్ ఉంటాయి. ఇంకా ఇందులో కాఫీ మేకర్, రిఫ్రిజిరేటర్‌లతో వినోదం కోసం పలు ఇంటర్నెట్ కెనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉండనున్నాయి. మరి ఈ రిన్‌స్పీడ్ మైక్రోమ్యాక్స్ ఈవి కాన్సెప్ట్ కారుపై ఓ కన్నేస్కోండి..!

రిన్‌స్పీడ్ మైక్రోమ్యాక్స్ ఈవి

రిన్‌స్పీడ్ మైక్రోమ్యాక్స్ ఈవి

రిన్‌స్పీడ్ మైక్రోమ్యాక్స్ ఈవి

రిన్‌స్పీడ్ మైక్రోమ్యాక్స్ ఈవి

రిన్‌స్పీడ్ మైక్రోమ్యాక్స్ ఈవి

రిన్‌స్పీడ్ మైక్రోమ్యాక్స్ ఈవి

రిన్‌స్పీడ్ మైక్రోమ్యాక్స్ ఈవి

రిన్‌స్పీడ్ మైక్రోమ్యాక్స్ ఈవి

రిన్‌స్పీడ్ మైక్రోమ్యాక్స్ ఈవి

రిన్‌స్పీడ్ మైక్రోమ్యాక్స్ ఈవి

రిన్‌స్పీడ్ మైక్రోమ్యాక్స్ ఈవి



Click it and Unblock the Notifications








