భారత్‌‌లో నాలుగో షోరూమ్‌ను ప్రారంభించిన రోల్స్ రాయిస్

By Ravi

బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ రోల్స్ రాయిస్‌కు భారత్‌లో అభిమానులు భారీగా పెరుగుతున్నట్లున్నారు. అందుకే, రోల్స్ రాయిస్ తమ వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు డీలర్‌షిప్‌ నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించుకుంటోంది. తాజాగా రోల్స్ రాయిస్ ఇండియా గుజరాత్ రాష్ట్రంలో ఓ కొత్త షోరూమ్‌ను ప్రారంభించింది.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ షోరూమ్‌ను ప్రారంభించారు. 2637 చ.అ. విస్తీర్ణంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ షోరూమ్‌ను నవనీత్ మోటార్స్ నిర్వహిస్తుంది. ఈ షోరూమ్‌ను రోల్స్ రాయిస్ ఏషియా ఎమర్జింగ్ మార్కెట్స్ జనరల్ మేనేజర్ హెర్‌ఫ్రీడ్ హసెనోహ్రీ మరియు రోల్స్ రాయిస్ అహ్మదాబాద్ అండ్ ముంబై సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ షరద్ కచాలియా చేతుల మీదుగా ప్రారంభించారు.


అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ షోరూమ్‌లో రెండు రోల్స్ కార్లను ప్రదర్శించవచ్చు. అంతేకాకుండా, కస్టమర్లు తమ నచ్చిన ఎక్స్టీరియర్ కలర్‌ను ఎంచుకునేందుకు గాను 44,000 కలర్లకు పైగా ఉన్న బెస్పోక్ లాంజ్, వుడ్ సెలక్షన్, లెథ్ ఇంటీరియర్ కాంబినేష్ కోసం ప్రత్యేక లాంజ్‌లను ఈ షోరూమ్‌లో ఏర్పాటు చేశారు.

రోల్స్ రాయిస్ ఇండియా ప్రస్తుతం దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఫాంటమ్, ఘోస్ట్, వ్రైత్ మోడళ్లు ఈ షోరూమ్‌లో అందుబాటులో ఉంటాయి. ఇది రోల్స్ రాయిస్ భారతదేశంలో నాల్గవ షోరూమ్ కావటం విశేషం. ఇప్పటికే రోల్స్ రాయిస్‌కు భారత్‌లోని ముంబై, హైదరాబాద్, న్యూఢిల్లీ రాష్ట్రాల్లో షోరూమ్‌లు ఉండగా, అక్టోబర్ 2013 నెలలోచంఢీఘడ్‌లో మరొక షోరూమ్‌ను ఏర్పాటు చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

Sharad Kachalia

More from DriveSpark

Article Published On: Saturday, September 7, 2013, 13:05 [IST]
English summary
Rolls Royce has now returned to the land of ‘The Star of India' with the opening of a new showroom in Ahmedabad. The fourth RR showroom in India. The showroom is maintained by authorised dealer, Navnit Motors Pvt Ltd.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+