హైదరాబాద్‌లో కొత్త రోల్స్ రాయిస్ షోరూమ్ ప్రారంభం

By Ravi

బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ రోల్స్ రాయిస్‌కు మరియు మన హైదరాబాద్‌కు చాలా ఏళ్ల అనుబంధమే ఉంది. నైజాం నవాబులను అలరించిన బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ ఇప్పుడు హైదరాబాద్‌లో కాలు మోపింది. భారతదేశంలో తమ మూడవ షోరూమ్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రోల్స్ రాయిస్ ఏర్పాటు చేసింది. ఇది రోల్స్ రాయిస్‌కు దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి షోరూమ్‌ కావటం విశేషం. హైదరాబాద్‌లో కున్‌ మోటోరెన్‌ను తమ అధీకృత డీలర్‌గా నియమించినట్లు రోల్స్ రాయిస్ పేర్కొంది.

మొత్తం 5400 చదరపు అడుగులు విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ షోరూమ్‌లో మూడు కార్లను ప్రదర్శనకు ఉంచవచ్చు. అలాగే, షోరూమ్‌కు విచ్చేసే వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఓ లాంజ్‌ను కూడా ఇందులో ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ కస్టమర్ లాంజ్‌లో వినియోగదారులు తమకు నచ్చిన విధంగా రోల్స్ రాయిస్ కార్లను ఎంచుకునే వెసలుబాటును కల్పించారు. 2013 మధ్యభాగం నాటికి దేశంలో మరో రెండు షోరూమ్‌లను ఏర్పాటు చేయాలని, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కస్టమైజ్డ్ ఉత్పత్తులు అందించాలని రోల్స్ రాయిస్ ఇండియా భావిస్తోంది.

పూర్తిగా విదేశాల్లో తయారైన రోల్స్ రాయిస్ కార్లను కంపెనీ భారత్‌కు దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయిస్తుంది. రోల్స్ రాయిస్ బ్రాండ్‌కు హైదరాబాద్‌కు ఓ ప్రత్యేక అనుబంధం కూడా ఉంది. నిజాంను పరిపాలించిన ఏడవ నిజాం మీర్ ఉస్మాన్‌ఖాన్ సిద్ధిఖీ అసఫ్ జా వద్ద సుమారు 50 వరకూ రోల్స్ రాయిస్ కార్లు ఉండేవని కంపెనీ వెల్లడించింది. భారత్‌తో దశాబ్ధాల అనుబంధం కలిగి ఉన్న రోల్స్ రాయిస్ 2005వ సంవత్సరంలో ముంబైలో తమ తొలిని షోరూమ్‌ను ప్రారంభించడం ద్వారా అధికారికంగా దేశీయ విపణిలోకి ప్రవేశించింది.

రోల్స్ రాయిస్ హైదరాబాద్‌ షోరూమ్

రోల్స్ రాయిస్ హైదరాబాద్‌ షోరూమ్

రోల్స్ రాయిస్ హైదరాబాద్‌ షోరూమ్

రోల్స్ రాయిస్ హైదరాబాద్‌ షోరూమ్

రోల్స్ రాయిస్ హైదరాబాద్‌ షోరూమ్

రోల్స్ రాయిస్ హైదరాబాద్‌ షోరూమ్

రోల్స్ రాయిస్ ఘోస్ట్

రోల్స్ రాయిస్ ఘోస్ట్

రోల్స్ రాయిస్ ఫాంటమ్

రోల్స్ రాయిస్ ఫాంటమ్

రోల్స్ రాయిస్ ఫాంటమ్

రోల్స్ రాయిస్ ఫాంటమ్

రోల్స్ రాయిస్ ఘోస్ట్

రోల్స్ రాయిస్ ఘోస్ట్

రోల్స్ రాయిస్ ఘోస్ట్

రోల్స్ రాయిస్ ఘోస్ట్

రోల్స్ రాయిస్ ఘోస్ట్

రోల్స్ రాయిస్ ఘోస్ట్

More from DriveSpark

Article Published On: Monday, February 25, 2013, 14:53 [IST]
English summary
British luxury carmaker Rolls Royce Motor Cars has inaugurated its third dealership in India. Company has appointed Kun Motoren as its official dealer in Hyderabad. This is the first showroom for Rolls Royce in South India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+